»   » మళ్లీ పోటీ కు వచ్చాడే...భాక్సాఫీస్ వద్ద బాస్ కుమ్ముడుకి... యంగ్ హీరోలకి వణుకు

మళ్లీ పోటీ కు వచ్చాడే...భాక్సాఫీస్ వద్ద బాస్ కుమ్ముడుకి... యంగ్ హీరోలకి వణుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం 150' ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తొలి షో నుండే ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం మిగతా సినిమాల పోటీని తట్టుకొని కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమాతో రికార్డులను బద్దలు కొడుతాడు అనుకున్నాం కానీ.. మరీ ఈ రెంజ్ లో సునామీ సృష్టిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. మొదటి రోజే ఈ సినిమా 'బాహుబలి'నే బీట్ చేసింది. ఆ తర్వాత ఊహించని రెంజ్ లో వసూళ్లు రాబడుతూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.


తమిళ 'కత్తి'కి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ నెం 150' చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం పోషించిగా. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. "కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ" బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా 19 రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో).


చెప్పుకోదగ్గ వసూళ్లనే..

చెప్పుకోదగ్గ వసూళ్లనే..

బాక్సాఫీస్ వద్ద బాస్ కుమ్ముడు ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడో వీకెండ్లోనూ ఆయన ప్రతిష్టాత్మక 150వ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లే రాబట్టింది. ఈ నేపధ్యంలో ట్రేడ్ వర్గాలు ఓవరాల్ గా 19 రోజుల (ఏపీ+తెలంగాణ) కలెక్షన్స్ వివరాలను వెల్లడించాయి.


ఇంత కలెక్ట్ చేయటం.

ఇంత కలెక్ట్ చేయటం.

ట్రేడ్ లెక్కల ప్రకారం. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 75.57 కోట్ల కలెక్ట్ చేసింది. కేవలం 19 రోజుల్లోనే. అది కూడా ఏపీ, తెలంగాణాల్లో ఇంతమొత్తం కలెక్ట్ చేయడం బాస్ కే చెల్లిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.


టోటల్ రన్ లో

టోటల్ రన్ లో

అంతేకాదు. ఇంత తక్కువ టైంలో రెండు రాష్ట్రాల్లో 75 కోట్ల మార్క్ని క్రాస్ చేసిన రెండో చిత్రంగా 'ఖైదీ' నిలిచి. మరో 'నాన్-బాహుబలి" రికార్డ్ సృష్టించింది. చూడబోతే. ఈ చిత్రం టోటల్ రన్ లో రూ.80 కోట్ల మార్క్ కూడా క్రాస్ చేయడం ఖాయమని అంటున్నారు.


అరుదైన ఘనత

అరుదైన ఘనత

ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల షేర్ రాబట్టి 'నాన్-బాహుబలి" రికార్డ్ క్రియేట్ చేసిన 'ఖైదీ". త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంకో అరుదైన ఘనత సాధించబోతోందన్నమాట. మొత్తానికి. అందరూ అనుకున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ చిత్రంతో సంచలనాలే సృష్టించాడు.


ఇదీ లెక్క..

ఇదీ లెక్క..

నైజాం : 19
సీడెడ్ : 1465
నెల్లూరు : 3.27
గుంటూరు : 7.04
కృష్ణా : 5.51
వెస్ట్ గోదావరి : 5.82
ఈస్ట్ గోదావరి : 7.83
ఉత్తరాంధ్ర : 12.45
ఏపీ+తెలంగాణ : రూ. 75.57 కోట్లు


ఈ సినిమాకు వన్ ఇండియా రివ్యూ చదవండి

ఈ సినిమాకు వన్ ఇండియా రివ్యూ చదవండి

చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'ఖైదీ నంబర్‌ 150' సంక్రాంతి కానుకగా విడుదలై కలెక్షన్స్ పరంగా రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది.

రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్‌ 150' రివ్యూ)


English summary
'Khaidi No.150' collected a Gross of over Rs 100 crore and Share of Rs 75 crore in Telugu States alone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu