»   » మరీ ఇంత తేడానా?: ‘గంగ’, 'ఉత్తమ విలన్‌' ..కలెక్షన్స్

మరీ ఇంత తేడానా?: ‘గంగ’, 'ఉత్తమ విలన్‌' ..కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్న వారం రిలీజైన రెండూ ...మంచి అంచనాలతో వచ్చిన తమిళ డబ్బింగ్ లే అవటం విశేషం. అందులో ఒకటి తానే హీరోగా చేస్తూ డైరక్ట్ చేసిన లారెన్స్... ‘గంగ', తానే కథ అందిస్తూ నిర్మించిన కమల్ 'ఉత్తమ విలన్‌' చిత్రం. ఈ రెండు ఈ హీరోల మానస పుత్రికలే. ఈ రెండు ఎప్పటినుంచో వస్తాను ...వస్తాను అంటూ ఒకదానికొకటి పోటీగా మార్కెట్లో విడుదలయ్యాయి. దానికి తోడు రెండు ఆర్దిక ఇబ్బందులతో రిలీజ్ కు ఇబ్బంది పడ్డాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం... ఉన్నంతలో ‘గంగ'మంచి రిపోర్ట్ సొంతం చేసుకుంది. రొటీన్ హర్రర్ సినిమానే అనిపించుకున్నా బి, సి సెంటర్ల వద్ద ఈ సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది. ‘గంగ' చిత్రం ఇప్పటివరకూ 11.7 కోట్ల వరకూ వచ్చింది.


collections about Ganga and Uttama Villian

అదే 'ఉత్తమ విలన్‌' సినిమా విషయానికి వస్తే...మార్నింగ్ షో నుంచే బోర్ సినిమా అని టాక్ తెచ్చుకోవటం మైనస్ అయ్యింది. మొదటి వీకెండ్ లో కేవలం 1.5 కోట్లు మాత్రమే సాధించింది. ఎంత వ్యత్యాసమో గమనించండి.


దానికి తోడు కమల్ హాసన్... చిత్రంపై ఎక్కువ పెట్టుబడి పెట్టారు. అదే గంగ విషయం వచ్చేసరి సాధ్యమైనంత తక్కువలో లాగించేసారు. కమల్ నటనా విశ్వరూపం చూపాడని వెళ్లే కొద్ది మంది ఆడియన్స్ తప్ప ప్రేక్షకులు కరువయ్యారు. అదే గంగకు ప్లస్ అయ్యింది.


ఇక మరో ప్రక్కన ఓకే బంగారం చిత్రం భాక్సాఫీస్ వద్ద అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ తేలేకపోయింది. జస్ట్ ఓకే అనిపించుకుంది. నాగచైతన్య తాజా చిత్రం దోచేయ్ ...డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే సన్నాఫ్ సత్యమూర్తి మాత్రం ఇప్పటికి వీకెండ్ లలో ఫ్యామీలలతో కళ కళ్లాడుతోంది.

English summary
For the first weekend, Ganga amassed 11.7+ crores nearly while Uttama Villain made just 1.5+ crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu