Coolie Vs War 2 Box Office: వరల్డ్‌వైడ్ కూలీకి ఎన్ని కోట్లు? వార్2 కలెక్షన్లు ఎంత? ఎన్టీఆర్ మూవీకి నష్టాలేనా?
భారతీయ సినిమా పరిశ్రమలో రజనీకాంత్, హృతిక్ రోషన్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిఫరెంట్‌గా ఫలితాలను రాబడుతున్నాయి. టాలీవుడ్ హీరోలు నాగార్జున అక్కినేని విలన్ పాత్రలో కనిపించిన కూలీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రాలు ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు నువ్వా? నేనా అనే విధంగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టాయి. అయితే గత 4 రోజుల్లో కూలీ, వార్ 2 సినిమాలు ఏ రేంజ్ వసూళ్లను సాధించాయనే వివరాల్లోకి వెళితే..
కూలీ 3 రోజుల కలెక్షన్లు
రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమై 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా రిలీజైన కూలీ చిత్రం విడుదలకు ముందే సంచలన రీతిలో వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం గత మూడు రోజుల్లో తమిళ భాషలో 76 కోట్ల రూపాయలు, తెలుగులో 42 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 29 కోట్ల రూపాయలు, కేరళలో 19 కోట్ల రూపాయలు, ఇండియాలో ఇతర ప్రాంతాల్లో 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 131 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 188 కోట్ల రూపాయల నెట్, ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

కూలీ 4వ రోజు వసూళ్లు
రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం 4వ రోజున కూడా భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలో 22.5 కోట్ల రూపాయలు, హిందీలో 4.5 కోట్ల రూపాయలు, తెలుగులో 6.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు వసూలు చేసిది. దాంతో ఈ చిత్రం 36 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను ఇండియాలో, 27 కోట్ల రూపాయలు ఓవర్సీస్ మార్కెట్‌లో వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 383 కోట్ల రూపాయల గ్రాస్, 211 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది.
3 రోజుల వార్ 2 బాక్సాఫీస్ రిపోర్ట్
ఇక హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నార్త్ ఇండియాలో ఈ సినిమా 104 కోట్ల రూపాయలు, తెలుగులో 50 కోట్ల రూపాయలు, కన్నడలో 12 కోట్ల రూపాయలు, తమిళంలో 3.5 కోట్ల రూపాయలు, కేరళలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 171.5 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 45 కోట్ల రూపాయలు నమోదు చేసింది. దాంతో 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
4వ రోజు వార్ 2 మూవీకి ఎన్ని కోట్లంటే?
ఇక వార్ 2 చిత్రం 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియా వైడ్‌గా 33.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. హిందీలో 26 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షలు, తెలుగులో 5 కోట్ల రూపాయలు, కన్నడలో 1.5 కోట్ల రూపాయలు, కేరళలో 25 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 33.25 కోట్లు నెట్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 200 కోట్ల నెట్, 262 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కూలీ, వార్ 2 సినిమాల బ్రేక్ ఈవెన్ ఎంత?
కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 307 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంది. ఇక వార్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 305 కోట్ల రూపాయల నెట్, 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు. అయితే ఈ రెండు సినిమాలు లాభాల్లోకి రావాలంటే.. ఇంకా భారీగానే వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











