Coolie Day 10 Box Office: మళ్లీ రేసులోకి కూలీ.. రజనీకాంత్ మూవీకి కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
భారీ అంచనాల మధ్య విడుదలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద నత్తనడకన సాగుతోంది. రెండో వారంలో తలైవా పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ చిత్రం 10 రోజుల్లో ఎంత వసూలు చేసింది? లాభాల్లోకి రావాలంటే కూలీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టాల్సి ఉంది? ఈ వివరాలు చూస్తే..
కూలీ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, రచితా రామ్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కూలీలో కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. అనిరుధ్ సంగీత దర్శకత్వం.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా కూలీ విడుదలైంది.

కూలీ బడ్జెట్ ఎంత?
కూలీని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాలలో కూలీ హక్కులను ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు)కు దక్కించుకుంది. దీంతో ఆంధ్రా, నైజాంలలో రజనీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కూలీ 9 రోజుల కలెక్షన్స్:
9 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజున 70 కోట్ల రూపాయలు, 2వ రోజున 57 కోట్ల రూపాయలు, 3వ రోజున 41 కోట్ల రూపాయలు, 4వ రోజున 37 కోట్ల రూపాయలు, 5వ రోజున 13 కోట్ల రూపాయలు, 6వ రోజున 10.35 కోట్ల రూపాయలు, 7వ రోజున 8 కోట్ల రూపాయలు, 8వ రోజున 6.50 కోట్ల రూపాయలు, 9వ రోజున 7 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియా వైడ్‌గా 9 రోజుల వరకు కూలీ మూవీకి 237 కోట్ల రూపాయల నెట్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో 169 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దాంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల వరకు కూలీ మూవీకి 450 కోట్ల రూపాయల గ్రాస్.. 224 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ 8 రోజుల వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.20 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2 కోట్ల రూపాయలు, 8వ రోజున కోటి 60 లక్షల రూపాయలు, 9వ రోజున 1.50 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో 9 రోజుల వరకు కూలీ మూవీ ఆంధ్రా, నైజాంలలో 67 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 16.75 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.80 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. మొత్తంగా 9 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ 46 కోట్ల రూపాయల షేర్.. 67 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 154 కోట్ల రూపాయలు , తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 16.50 కోట్ల రూపాయలు, కేరళలలో 14 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కూలీ 10వ రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో కూలీకి 10వ రోజైన శనివారం బుకింగ్స్ పెరిగాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ పుంజుకున్నాయి. 10వ రోజు సాయంత్రం 5 గంటల వరకు తమిళంలో 27 శాతం, హిందీలో 12 శాతం, తెలుగులో 21 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 10వ రోజు కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ+ హిందీలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో 10 రోజుల వరకు కూలీ ప్రపంచవ్యాప్తంగా 465 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











