Coolie Day 11 Box Office: రజనీ వసూళ్ల ఊచకోత.. ది గోట్ రికార్డ్ బ్రేక్.. 500 కోట్లకు చేరువగా కూలీ

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, రచితా రామ్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కూలీలో కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌‌తో అలరించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 10 రోజుల్లో కూలీ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? కూలీ లాభాల్లోకి రావాలంటే ఇంకా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది? ఈ వివరాల్లోకి వెళితే..

కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చులతో కలిపి కూలీకి దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలలో కూలీ హక్కులను ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు)కు దక్కించుకుంది. దీంతో ఆంధ్రా, నైజాంలలో రజనీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

Coolie Day 11 Expected Box Office Collections Worldwide rajinikanth film heading towards 500 crores milestone

వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కూలీ 10 రోజుల కలెక్షన్స్:
10 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజున 70 కోట్ల రూపాయలు, 2వ రోజున 57 కోట్ల రూపాయలు, 3వ రోజున 41 కోట్ల రూపాయలు, 4వ రోజున 37 కోట్ల రూపాయలు, 5వ రోజున 13 కోట్ల రూపాయలు, 6వ రోజున 10.35 కోట్ల రూపాయలు, 7వ రోజున 8 కోట్ల రూపాయలు, 8వ రోజున 6.50 కోట్ల రూపాయలు, 9వ రోజున 7 కోట్ల రూపాయలు రాబట్టింది. గత కొద్దిరోజులుగా పడుతూ లేస్తూ సాగుతున్న కూలీకి 10వ రోజు దుమ్మురేపింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 12 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో భారత్‌‌లో 10 రోజుల వరకు కూలీ మూవీకి 250 కోట్ల రూపాయల నెట్.. 292 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో 173 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల వరకు కూలీ మూవీకి 465 కోట్ల రూపాయల గ్రాస్.. 233 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో కూలీ 10 రోజుల వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.20 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2 కోట్ల రూపాయలు, 8వ రోజున కోటి 60 లక్షల రూపాయలు, 9వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 10వ రోజున 2.20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో 10 రోజుల వరకు కూలీ మూవీ ఆంధ్రా, నైజాంలలో 70 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 17.30 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.25 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.75 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.25 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. మొత్తంగా 10 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ 48 కోట్ల రూపాయల షేర్.. 70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 161 కోట్ల రూపాయలు , తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 17 కోట్ల రూపాయలు, కేరళలో 15 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

కూలీ 11వ రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు. శనివారం అనూహ్యంగా పుంజుకున్న కూలీ.. ఆదివారం కూడా అదే జోరును కంటిన్యూ చేస్తోంది. 11వ రోజు సాయంత్రం 6 గంటల వరకు తమిళంలో 36 శాతం, హిందీలో 15 శాతం, తెలుగులో 24 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 11వ రోజు కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళంలో 7 కోట్ల రూపాయలు, తెలుగులో 4 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ+ హిందీలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 17 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో 11 రోజుల వరకు కూలీ ప్రపంచవ్యాప్తంగా 482 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు.

వరల్డ్ వైడ్‌గా ఆదివారం మార్నింగ్ షో కలెక్షన్స్‌తో దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్) సినిమా కలెక్షన్స్‌ను రజనీకాంత్ బద్దలు కొట్టారు. ది గోట్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 465 కోట్ల రూపాయల రాబట్టగా.. కూలీ 11వ రోజు ఉదయం నాటికే ఈ రికార్డును బద్ధలు కొట్టారు. దీంతో రజనీ 500 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా పరుగులు తీస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X