Coolie Day 13 Box Office: పడిపోయిన కూలీ కలెక్షన్స్.. రజనీకాంత్ మూవీకి ఎన్నికోట్లంటే?
కోలీవుడ్‌లో ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి 2025లో మోస్ట్ అవైటెడ్ మూవీగా కూలీ నిలిచింది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, రచితా రామ్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కూలీలో కీలకపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అలరించారు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 10 రోజుల్లో కూలీ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది? కూలీ లాభాల్లోకి రావాలంటే ఇంకా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది? ఈ వివరాల్లోకి వెళితే..
కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చులతో కలిపి కూలీకి దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలలో కూలీ హక్కులను ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు)కు దక్కించుకుంది. దీంతో ఆంధ్రా, నైజాంలలో రజనీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కూలీ 12 రోజుల కలెక్షన్స్:
12 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజున 70 కోట్ల రూపాయలు, 2వ రోజున 57 కోట్ల రూపాయలు, 3వ రోజున 41 కోట్ల రూపాయలు, 4వ రోజున 37 కోట్ల రూపాయలు, 5వ రోజున 13 కోట్ల రూపాయలు, 6వ రోజున 10.35 కోట్ల రూపాయలు, 7వ రోజున 8 కోట్ల రూపాయలు, 8వ రోజున 6.50 కోట్ల రూపాయలు, 9వ రోజున 7 కోట్ల రూపాయలు, 10వ రోజున 11 కోట్ల రూపాయలు, 11వ రోజున 12 కోట్ల రూపాయలు, 12వ రోజున 4 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియా వైడ్‌గా కూలీ సినిమాకు 260 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాగా.. 310 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో కూలీ సినిమాకు 180 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా 12 రోజుల వరకు రజనీకాంత్ మూవీకి 246 కోట్ల రూపాయల షేర్.. 490 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ 12 రోజుల వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.20 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2 కోట్ల రూపాయలు, 8వ రోజున కోటి 60 లక్షల రూపాయలు, 9వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 10వ రోజున 2.20 కోట్ల రూపాయలు, 11వ రోజున 2 కోట్ల రూపాయలు, 12వ రోజున కోటి రూపాయలు, 13వ రోజున కోటి రూపాయలు వసూళ్లు వచ్చాయి. దాంతో 12 రోజుల వరకు కూలీ మూవీ ఆంధ్రా, నైజాంలలో 70 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 17.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6.50 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.80 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.20 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. మొత్తంగా 12 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ 50 కోట్ల రూపాయల షేర్.. 70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 171 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 18 కోట్ల రూపాయలు, కేరళలో 16 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కూలీ 13వ రోజు కలెక్షన్స్
వీకెండ్‌లో జూలు విదిల్చిన రజనీకాంత్.. వర్కింగ్ డేస్‌లో నిరాశపరిచాడు. అయినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వస్తూనే ఉన్నాయి. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూలీ సాలీడ్‌గా కలెక్షన్స్ రాబడుతోంది. 13వ రోజు తమిళంలో 17 శాతం, హిందీలో 16 శాతం, తెలుగులో 17 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 12వ రోజు కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళంలో 1.50 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, కర్ణాటక, కేరళ+ హిందీలో 3 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దాంతో 13 రోజుల వరకు కూలీ ప్రపంచవ్యాప్తంగా 494 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.


Click it and Unblock the Notifications











