Coolie Day 4 Box Office: బాక్సాఫీస్‌పై రజనీకాంత్ దండయాత్ర.. 400 కోట్లకు చేరువగా కూలీ!
వరుస విజయాలతో దూకుడు మీదున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్వకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగతెరకెక్కిన సినిమా కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కూలీ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఇందులో స్పెషల్ సాంగ్‌లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా కూలీ విడుదలైంది. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4వ రోజు కూలీ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..
కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.350 కోట్ల బడ్జెట్ అయింది. తెలుగు రాష్ట్రాలలో కూలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు) వెచ్చించి కూలీ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కూలీ మూడు రోజుల కలెక్షన్స్:
కూలీకి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు 88 కోట్ల కోట్ల రూపాయలు, మూడో రోజున 80 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 325 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. మూడు రోజుల వరకు వరకు తమిళనాడులో 110 కోట్ల రూపాయలు, హిందీలో 20 కోట్ల రూపాయలు, తెలుగులో 45 కోట్ల రూపాయలు, కన్నడంలో 10 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 200 కోట్ల కోట్ల రూపాయల నెట్.. 215 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్‌లో రజనీకాంత్ హవా ఏమాత్రం తగ్గలేదు ఇప్పటి వరకు కూలీకి 110 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ వసూళ్లు కలిపి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కూలీ మూవీకి 168 కోట్ల రూపాయల షేర్.. 325 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో కూలీ వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 10 కోట్ల రూపాయల చొప్పున మూడు రోజుల్లో 45 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 17 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 4 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. దీంతో లోకేష్ కనగరాజ్- రజనీకాంత్ మూవీకి రెండు రోజుల్లో 20 కోట్ల రూపాయల షేర్.. 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
కూలీ 4వ రోజు కలెక్షన్స్
తొలి మూడు రోజులతో పోలిస్తే 4వ రోజు కూలీకి స్వల్పంగా బుకింగ్స్ తగ్గినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. తెలుగు కంటే తమిళంలోనే టికెట్లు తెగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు తమిళ వెర్షన్‌లో 46 శాతం, హిందీ వెర్షన్‌లో 19 శాతం, తెలుగు వెర్షన్‌లో 31 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఈ లెక్కన 4వ రోజు కూలీకి తమిళంలో 23 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ+ హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో నాలుగు రోజుల్లోనే కూలీ 375 కోట్ల మార్క్ అందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











