Coolie Day 6 Box Office: కూలీ కలెక్షన్స్‌పై ఊహించని దెబ్బ.. రజనీ మూవీకి ఎన్ని కోట్లంటే?

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కూలీ. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఇందులో స్పెషల్ సాంగ్‌లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా కూలీ విడుదలైంది. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4వ రోజు కూలీ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..

కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.350 కోట్ల బడ్జెట్‌ అయింది. తెలుగు రాష్ట్రాలలో కూలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు) వెచ్చించి కూలీ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

Coolie Day 6 Expected Box Office Collections Worldwide rajinikanth film faces huge drop

వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కూలీ 5 రోజుల కలెక్షన్స్:
5 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజున 70 కోట్ల రూపాయలు, 2వ రోజున 57 కోట్ల రూపాయలు, 3వ రోజున 41 కోట్ల రూపాయలు, 4వ రోజున 37 కోట్ల రూపాయలు, 5వ రోజున 13 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో ఇండియా వైడ్‌గా ఐదు రోజుల వరకు కూలీ మూవీకి 207 కోట్ల రూపాయల నెట్.. 245 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో 160 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దాంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా కూలీ మూవీకి 405 కోట్ల రూపాయల గ్రాస్.. 203 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో కూలీ వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు చొప్పున ఐదు రోజుల్లో 58 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 16 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.25 కోట్ల రూపాయలు, గుంటూరులో 4 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. మొత్తంగా 5 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీకి 38 కోట్ల రూపాయల షేర్.. 58 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 105 కోట్ల రూపాయలు , తెలుగు రాష్ట్రాల్లో 58 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 36 కోట్ల రూపాయలు, కేరళలలో 22 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 32 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

కూలీ 6వ రోజు కలెక్షన్స్
వర్కింగ్ డేస్‌కి తోడు వర్షాల కారణంగా కూలీకి బుకింగ్స్ పడిపోతున్నాయి. 6వ రోజు సాయంత్రం 5 గంటల వరకు తమిళ్ వెర్షన్‌లో 21 శాతం, హిందీలో 20 శాతం, తెలుగులో 17 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, హిందీ, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 6వ రోజు వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో 6 రోజుల వరకు కూలీకి ప్రపంచవ్యాప్తంగా 420 కోట్ల రూపాయల వసూళ్లకు చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X