Coolie Day 7 Box Office: భారీగా క్షీణించిన కూలీ కలెక్షన్స్.. రజనీ మూవీకి గండం గట్టెక్కాలంటే?
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ 2. ఓటమి ఎరుగని దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, రచితా రామ్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. యంగ్ సెన్షేషన్ అనిరుధ్ రవించందర్ కూలీ చిత్రానికి స్వరాలు సమకూర్చగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా కూలీ విడుదలైంది. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 7వ రోజు కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే..
కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.350 కోట్ల బడ్జెట్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. భారీ స్టార్ క్యాస్టింగ్, నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు కళానిధి మారన్. తెలుగు రాష్ట్రాలలో కూలీ హక్కులను ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు)కు దక్కించుకుంది. దీంతో ఆంధ్రా, నైజాంలలో రజనీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఓవరాల్‌గా రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కూలీ 6 రోజుల కలెక్షన్స్:
6 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజున 70 కోట్ల రూపాయలు, 2వ రోజున 57 కోట్ల రూపాయలు, 3వ రోజున 41 కోట్ల రూపాయలు, 4వ రోజున 37 కోట్ల రూపాయలు, 5వ రోజున 13 కోట్ల రూపాయలు, 6వ రోజున 10.35 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియా వైడ్‌గా 7 రోజుల వరకు కూలీ మూవీకి 218 కోట్ల రూపాయల నెట్.. 255 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో 163 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దాంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా కూలీ మూవీకి 418 కోట్ల రూపాయల గ్రాస్.. 207 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.20 కోట్ల రూపాయలు చొప్పున ఆరు రోజుల్లో 61 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 16 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.50 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.50 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.75 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. మొత్తంగా 6 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ 40 కోట్ల రూపాయల షేర్.. 61 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 142 కోట్ల రూపాయలు , తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 15 కోట్ల రూపాయలు, కేరళలలో 12 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కూలీ 7వ రోజు కలెక్షన్స్
కూలీకి కష్టాలు ఏమాత్రం తగ్గడం లేదు. క్రమం తప్పకుండా రజనీకాంత్ సినిమా బుకింగ్స్ కోల్పోతూనే ఉంది. 7వ రోజు సాయంత్రం 8 గంటల వరకు ఈ చిత్రం తమిళంలో 20 శాతం, హిందీలో 10 శాతం, తెలుగులో 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. 7వ రోజు కూలీ సినిమా తమిళంలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ+ హిందీలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో కలిపి 7 రోజుల వరకు కూలీ సినిమా వరల్డ్ వైడ్‌గా 430 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అందరు రజనీకాంత్ 500 కోట్ల రూపాయల మార్క్ ఎప్పుడు చేరుకుంటాడా? అని ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











