Coolie Day 9 Box Office: రోబో, జైలర్ రికార్డుల్ని కొట్టలేకపోయిన కూలీ.. రజనీ మూవీకి ఎన్ని కోట్లంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథుల్ని ఒకే చోటికి చేర్చి లోకేష్ కనగరాజ్ సినిమాపై అంచనాలు పెంచేశారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబ్బా మోనికా జాన్, రచితా రామ్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు కూలీలో కీలకపాత్రలు పోషించారు. పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. అనిరుధ్ సంగీత దర్శకత్వం.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా కూలీ విడుదలైంది. ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..
కూలీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.350 కోట్ల బడ్జెట్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. భారీ స్టార్ క్యాస్టింగ్, నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు కళానిధి మారన్. తెలుగు రాష్ట్రాలలో కూలీ హక్కులను ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్‌కు చెందిన ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 53 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 54 కోట్లు)కు దక్కించుకుంది. దీంతో ఆంధ్రా, నైజాంలలో రజనీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

వరల్డ్ వైడ్‌గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబూషన్ షేర్.. 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాను వరల్డ్ వైడ్‌గా 12000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కూలీ 8 రోజుల కలెక్షన్స్:
8 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజున 70 కోట్ల రూపాయలు, 2వ రోజున 57 కోట్ల రూపాయలు, 3వ రోజున 41 కోట్ల రూపాయలు, 4వ రోజున 37 కోట్ల రూపాయలు, 5వ రోజున 13 కోట్ల రూపాయలు, 6వ రోజున 10.35 కోట్ల రూపాయలు, 7వ రోజున 8 కోట్ల రూపాయలు, 8వ రోజున 6.50 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియా వైడ్‌గా 8 రోజుల వరకు కూలీ మూవీకి 230 కోట్ల రూపాయల నెట్.. 272 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో 168 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దాంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల వరకు కూలీ మూవీకి 440 కోట్ల రూపాయల గ్రాస్.. 219 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ 8 రోజుల వసూళ్లు
తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండో రోజున 15 కోట్ల రూపాయలు, మూడో రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.20 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2 కోట్ల రూపాయలు, 8వ రోజున కోటి 60 లక్షల రూపాయలు వచ్చాయి. దాంతో 8 రోజుల వరకు కూలీ మూవీ ఆంధ్రా, నైజాంలో 65 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 16.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.40 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.70 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.90 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది కూలీ. మొత్తంగా తొలి వారం తెలుగు రాష్ట్రాల్లో కూలీ 44 కోట్ల రూపాయల షేర్.. 65 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 150 కోట్ల రూపాయలు , తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 16 కోట్ల రూపాయలు, కేరళలలో 14 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కూలీ 9వ రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో పాటు వర్షాల ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ తమిళనాడుతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో కూలీకి 9వ రోజున శుక్రవారం బుకింగ్స్ పెరగలేదు. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు టికెట్స్ తెగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 9వ రోజు సాయంత్రం 5 గంటల వరకు తమిళంలో 15 శాతం, హిందీలో 8 శాతం, తెలుగులో 16 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 9వ రోజు కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళంలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి 50 లక్షల రూపాయలు, కర్ణాటక, కేరళ+ హిందీలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 7 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో 9 రోజుల వరకు కూలీ ప్రపంచవ్యాప్తంగా 447 కోట్ల రూపాయల గ్రాస్
వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
కాగా.. కూలీ కలెక్షన్స్ దారుణంగా ఉండటంతో రజనీకాంత్ ఓ రికార్డ్ మిస్ అయ్యారు. తలైవా చిత్రాల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలి వారం కలెక్షన్స్ పరంగా రోబో 2.0 (303.25 కోట్లు) టాప్‌లో ఉండగా.. జైలర్ (235.85 కోట్లు) సెకండ్ ప్లేస్‌లో ఉంది. కూలీ ఊపు చూస్తే రోబో, జైలర్ రికార్డులన్నీ బద్ధలు కొడతారని అనుకున్నారు. కానీ రజనీ సినిమాకు 5వ రోజు నుంచే వసూళ్లు తగ్గడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











