Coolie North America Collections: అమెరికాలో కూలీ సంచలనం.. ఛావా రికార్డు బ్రేక్.. ఓవర్సీస్‌లో ఎన్ని కోట్లంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కూలీ. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని బడ్జెట్‌ను 350 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు అని పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇటీవల కాలంలో భారీ వసూళ్లు సాధించిన చిత్రాల కలెక్షన్లను అధిగమించింది. కూలీ నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Coolie Movie North America

ఇక రజనీకాంత్ సినిమా ఓవర్సీస్ రైట్స్ కళ్లు చెదిరే రేటుకు అమ్ముడుపోవడం ఇండస్ట్రీ టాక్‌గా మారింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను విదేశాల్లో తమిళ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రముఖ సంస్థ చేజిక్కించుకొన్నది. నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా తదితర దేశాల ఈ సినిమా హక్కులు సుమారుగా 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ట్రేడ్ వర్గాల చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమా 90 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఓవర్సీస్ బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

నార్త్ అమెరికాలో కూలీ సినిమాను ప్రత్యాంగీరా సినిమాస్ భారీగా రిలీజ్ చేసింది. ఈ సినిమా గత వారం రోజుల్లో సుమారుగా 7 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 61 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే 2025 సంవత్సరంలో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఎంపురాన్, ఛావా, సైయారా, వార్ 2 చిత్రాలు నిలిచాయి.

అయితే రష్మిక మందన్న, వికీ కౌశల్ నటించిన చావా చిత్రం ఈ ఏడాది రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం దాదాపు 6.5 మిలియన్ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 56 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ వసూళ్లను తాజాగా కూలీ చిత్రం అధిగమించడం విశేషంగా మారింది.

ఇదిలా ఉండగా, సింగపూర్, మలేషియా, యూకే, ఆస్ట్రేలియాలో కూడా కూలీ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు 167 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. దాదాపు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాలను ఆర్జించే దిశగా పరుగులు పెడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X