»   » క్రికెట్ గాడ్ సచిన్ మూవీ తొలి రోజు కలెక్షన్ ఎంతో తెలుసా?

క్రికెట్ గాడ్ సచిన్ మూవీ తొలి రోజు కలెక్షన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్ జీవితంపై తెరకెక్కిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' గురువారం గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తమిళ్, మరాఠీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు. అన్ని భాషల్లో కలిపి తొలిరోజు ఈ చిత్రం ఇండియా వ్యప్తంగా రూ. 8.40 కోట్లు వసూలు చేసింది.

సచిన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఈ చిత్రంపై ముందు నుండి ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఈ సినిమాను ఇండియా వ్యాప్తంగా 2400 స్క్రీన్లలో విడుదల చేయగా.... విదేశాల్లో 400 స్క్రీన్లలో రిలీజ్ చేసారు.

డాక్యుమెంటరీ డ్రామా

డాక్యుమెంటరీ డ్రామా

సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్ మామూలు సినిమా ఫార్మాట్లో కాకుండా ఒక డాక్యుమెంటరీ డ్రామాగా తెరకెక్కించారు. సచినే మన ముందు నిలబడి తన జీవితాన్ని వివరించినట్లు ఎంతో పొందికగా రూపొందించారు.

ఇంప్రెసివ్ కలెక్షన్

ఇంప్రెసివ్ కలెక్షన్

ఒక డాక్యుమెంటరీ డ్రామాకు తొలి రోజు రూ. 8 కోట్ల పైచిలుకు కలెక్షన్ రావడం గొప్ప విషయమే. అందులోనూ శుక్రవారం వర్కింగ్ డే. కలెక్షన్లు ఇంప్రెసివ్ గా ఉన్నాయని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. శనివారం, ఆదివారం వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

లాభా పేక్షతో తీసిన సినిమా కాదు

లాభా పేక్షతో తీసిన సినిమా కాదు

అయినా... ఈ చిత్రం లాభాపేక్షతో తీసిన చిత్రం కానే కాదు. క్రికెట్ ను మతంగా ఆరాధించే ఈ దేశంలో దేవుడిగా ఎదిగిన సచిన్ జీవిత చరిత్రను అభిమానులకు అందించాలనే ఉద్దేశ్యంతో చిత్రీకరించారు.

సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్’ రివ్యూ

సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్’ రివ్యూ

సచిన్ -ఎ బిలియన్ డ్రీమ్స్ మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి.

English summary
Sachin Tendulkar’s film, Sachin: A Billion Dreams creates history on the first day at box office. The docu-drama faced the biggest opening with Rs 8.40 cr in India in all languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu