twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలిని వెంటాడుతున్న దంగల్.. కలెక్షన్ల కుంభవర్షం.. ఒకే రోజు 100 కోట్లు..

    ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2, దంగల్ సినిమాలు కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తున్నాయి. బాహుబలి చిత్రం విడుదలై 22 రోజులు కావోస్తున్నా వసూళ్ల వరద ఎదురేలేకుండా పోతున్నది.

    By Rajababu
    |

    ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2, దంగల్ సినిమాలు కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తున్నాయి. బాహుబలి చిత్రం విడుదలై 22 రోజులు కావోస్తున్నా వసూళ్ల వరద ఎదురేలేకుండా పోతున్నది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఈ రెండు చిత్రాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. బాహుబలి రిలీజ్ తర్వాత మే 5వ తేదీన చైనాలో విడుదలైన అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం వసూళ్ల తుఫాన్‌ను కొనసాగిస్తున్నది.

    బాహుబలి 1538.. దంగల్ 1414..

    బాహుబలి 1538.. దంగల్ 1414..

    ఏప్రిల్ 20వ తేదీ (శనివారం) వరకు అందిన సమాచారం ప్రకారం బాహుబలి2 చిత్రం రూ.1538 కోట్లతో దూసుకెళ్తున్నది. అలాగే దంగల్ చిత్రం రూ.1418 కోట్లకు చేరుకొన్నది. ఈ రెండు చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్‌లో పోటాపోటీగా వసూళ్లను సాధించడం ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

    ఒక్కరోజే వంద కోట్లు..

    ఒక్కరోజే వంద కోట్లు..

    చైనాలో దంగల్ చిత్రం మే 20 శనివారం ఒక్కరోజే రూ.104 కోట్లు (16.16 మిలియన్ డాలర్లు) వసూలు చేయడం ఓవర్సీస్ మార్కెట్‌లో ఓ రికార్డు. ఇప్పటివరకు చైనాలో ఈ చిత్రం రూ.649.05 కోట్ల వసూళ్లను సాధించడం గమనార్హం.

    బాహుబలి 23 రోజుల కలెక్షన్లు.

    బాహుబలి 23 రోజుల కలెక్షన్లు.

    బాహుబలి2 సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 23 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇండియాలో రూ.1256 కోట్ల గ్రాస్‌, రూ.973 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో రూ.282 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తం కలిపితే రూ.1538 కోట్లుగా లెక్కకట్టారు.

    ఉత్తర అమెరికాలో ..

    ఉత్తర అమెరికాలో ..

    బాహుబలి2 విడుదలై నాలుగు వారాలైనప్పటికీ.. విదేశాల్లో కలెక్షన్ల జోరు కొనసాగుతునే ఉంది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, మలేషియా, ఆస్ట్రేలియాలో మంచి వసూళ్లను సాధిస్తున్నది అని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా తెలిపారు. మే 18 తేదీ వరకు అమెరికాలో 1,86,38,962 డాలర్లను, కెనడాలో 7,74,639 డాలర్లను కలెక్ట్ చేసింది అని తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

    English summary
    Aamir Khan's Dangal has become the only Indian film to rake in Rs 500 crore in China and to be top of the Chinese box office for seven straight days. Dangal film has been top of the Chinese box office for seven straight days. No Indian film - not even Baahubali - has achieved this in a major overseas market.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X