Just In
- 48 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొదలైన రజినీ మ్యానియా.. మొదటి రోజు ఎంత కొల్లగొడతాడంటే..?
ఇండియన్ సూపర్ స్టార్ రజనీ మ్యానియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలైవ సినిమా వస్తోందంటే కార్పోరేట్ కంపెనీలు సైతం సెలవు ప్రకటించాల్సిందే. గాల్లోకి ఆయన పోస్టర్లు ఎగరాల్సిందే. ఆరు పదుల వయసు దాటినా రజినీ ఏ మాత్రం తగ్గకుండా యువ హీరోలకు పోటీ ఇస్తూ చకచకా ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేస్తున్నాడు. తాజాగా రజినీ-మురుగుదాస్ కాంబినేషన్‌లో దర్బార్ అనే చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రజినీ-మురుగుదాస్ కాంబోపై అంచనాలు..
కమర్షియల్ అంశాలతో పాటు, సామాజిక దృక్పథమున్న చిత్రాలను తెరకెక్కిస్తాడనే జాతీయ స్థాయిలో మంచి పేరున్న దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ రజనీ కాంత్‌తో సినిమా ప్రకటించగానే అందరిలోనూ అంచనాలు పెరిగాయి. దీనికి తగ్గట్టే పోస్టర్లు, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఇలా అన్నీ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

తెలుగులోనూ భారీ స్క్రీన్స్..
సంక్రాంతి సీజన్ కావడంతో డబ్బింగ్ సినిమాకు సాధారణంగా థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. అయితే దర్బార్ తెలుగు చిత్రాలతో పోటీకి దూరంగా ఉండటం, మధ్యలో రెండు రోజులు గ్యాప్ రావడంతో దర్బార్‌కు భారీ మొత్తంలో థియేటర్లను కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు దర్భార్ హవా కొనసాగేట్టు కనిపిస్తోంది.

దాదాపు 700 తెరలపై..
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 700 తెరలపై దర్బార్ రన్ అవుతున్నట్టు సమాచారం. నైజాంలో 250, సీడెడ్‌లో 140, ఏపీ 350 ఇలా మొత్తంగా దర్భార్ హవా కొనసాగుతోంది. ఈ రెండు రోజులు కలెక్షన్లలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉంది.

బుకింగ్స్‌లో జోరు..
రజినీ సినిమా అంటే తెలుగులోనూ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకుడు కావడంతో అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే.. దాదాపు యాభై శాతం బుకింగ్స్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.

దాదాపు రెండు కోట్లు..
ఈ లెక్కన చూసుకుంటే దర్బార్‌కు బాగానే కలిసే వచ్చే అవకాశముంది. దాదాపు 700 తెరల్లో విడుదల కావడం, పోటీకీ మరే చిత్రం లేకపోవడం లాంటి అంశాలు ప్లస్ అయ్యాయి. ఈ క్రమంలో అందరి దృష్టి ఫస్ట్ డే కలెక్షన్లపై పడింది. ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రెండు కోట్లను రాబట్టే అవకాశముందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కలపై ఓ క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.