Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్: ‘డియర్ కామ్రేడ్’ లాభాల్లోకి రావాలంటే...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్(3 డేస్) పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టింది. అయితే సినిమాకు మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్ల జోరు కాస్త తగ్గింది. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం గుడ్ బిజినెస్ చేసింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఆయా భాషల్లో రిలీజ్ చేశారు.

తొలి వారాంతం కలెక్షన్
‘డియర్ కామ్రేడ్' చిత్రం ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ రూ. 18.85 కోట్లు(డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లు పరిశీలిస్తే రూ. 12.56 కోట్లు రాబట్టింది. ఇందులో రూ.6.83 కోట్లు మొదటి రోజు వసూలు కావడం గమనార్హం. మిక్డ్స్ టాక్ కారణంగా తర్వాతి రెండు రోజులు కలిపినా ఓపెనింగ్స్ డే స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయింది.

ఏరియా వైజ్ షేర్
3 డేస్ ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే...నైజాంలో రూ. 5.65 కోట్లు, సీడెడ్ రూ. 1.08 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.56 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.20 కోట్లు, కృష్ణ రూ. 73 లక్షలు, గుంటూరు రూ. 1.03 కోట్లు, వెస్ట్ రూ. 83 లక్షలు, నెల్లూరు రూ. 48 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం అన్ని వెర్షన్లు కలపి రూ. 3.25 కోట్లు, ఓవర్సీస్ రూ. 3 కోట్లు వసూలు చేసింది.

లాభం రావాలంటే....
ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 34.60 కోట్లకు అమ్మారు. ఫస్ట్ వీకెండ్ రూ. 18.81 కోట్లు వసూలు చేసింది. సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా వరల్డ్ వైడ్ షేర్ రూ. 15 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింటును రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇతర భాషల్లో పరిస్థితి ఎలా ఉంది?
‘డియర్ కామ్రేడ్' విజయ్ కెరీర్లో తొలిసారిగా నాలుగు భాషల్లో విడుదలైన మూవీ. తెలుగులో మాదిరిగానే తమిళం, మలయాళం, కన్నడలో కూడా రెస్పాన్స్ యావరజ్ అనే విధంగా ఉంది. రెస్టాఫ్ ఇండియా అన్ని వెర్షన్లు కలిపి రూ. 8 కోట్లకు రైట్స్ అమ్మారు. ఇప్పటి వరకు రూ. 3.25 కోట్లు వసూలు చేసింది.

ఓవర్సీస్ ఏరియాలో పరిస్థితి బెటర్
అయితే ఓవర్సీస్ ఏరియాలో ‘డియర్ కామ్రేడ్' రెస్పాన్స్ బావుంది. రూ. 4 కోట్లకు ఈ మూవీ రైట్స్ అమ్మారు. యూఎస్ఏ ప్రీమియర్ షోలతో పాటు ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లు రావడంతో టోటల్ షేర్ కలెక్షన్ రూ. 3 కోట్లకు చేరుకుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఈజీగా గట్టెక్కుతారని టాక్.