Demon Slayer Box Office: 2670 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. డీమాన్ స్లేయర్‌కు ఇండియాలో ఎన్ని కోట్లంటే?
అత్యంత పాపులారిటీ ఉన్న డిమాన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాజిల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. జపానీస్ యానిమిటేడ్ డార్క్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనే కాకుండా ఇండియాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్‌లో సంచలన రీతిలో టికెట్లు బుక్ అయ్యాయి అని బుక్ మై షో ఆన్ లైన్ వెబ్‌సైట్‌లో స్పష్టమైంది. ఈ సినిమా గురించిన విషయాలు, టెక్నికల్ విభాగాల గురించి, అలాగే తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డిమాన్ స్లేయర్ సినిమాలో నాట్సూకీ హానే, అకరీ కిటో, యాషిట్సుగు మాటస్కురా, హీరో షిమోనో, టకహిరో సాకురాయ, అకీరా ఇషిదా పాత్రలు కీలకంగా ఉంటాయి. ఈ సినిమాకు యూచీ టెరావో సినిమాటోగ్రఫి, మానాబు కమినో ఎడిటింగ్, యూకీ కుజీరా మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను యూఫో టేబుల్ నిర్మించగా హారూ సోటోజాకీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏషియన్ కంట్రీస్‌లో సోని పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నది.

వాస్తవానికి ఈ సినిమా జపాన్‌లో జూలై 18వ తేదీనే రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపింది. జపాన్‌లో ఈ సినిమా 2025 సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా.. ఆ దేశ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికే 302 మిలియన్ డాలర్లు అంటే 2671 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం భారత్‌తోపాటు ఏషియాలోని అన్ని ప్రధాన దేశాల్లోను, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్దమైంది.
హైదరాబాద్‌లో డిమాన్ స్లేయర్ సంచలన రీతిలో టికెట్ల అమ్మకాలను కొనసాగిస్తున్నది. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఇప్పటికే 18 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. నాన్ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్‌లో టికెట్లు అమ్ముడుపోవడం ప్రసాద్ మల్టీ ప్లెక్స్ హిస్టరీలో ప్రత్యేకంగా చెప్పుకొంటున్నారు. ఓ యానిమేషన్ సినిమా 5 భాషల్లో విడుదల కావడం మరో రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఈ సినిమా 48 గంటల్లో 15 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
ఇక నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద డీమాన్ స్లేయర్ చిత్రం మోత మోగిస్తున్నది. ఈ సినిమా కోసం భారీగా ప్రీమియర్లు ప్రదర్శిస్తున్నారు. 2 వేలకుపైగా థియేటర్లలో 14 వేల షోలను ప్రదర్శిస్తున్నారు. ప్రీమియర్ల కోసం 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రీమియర్ల ద్వారా 8,320,627 డాలర్లు రాబట్టింది. ఇక ఫస్ట్ డే కోసం 11,025,112 డాలర్లు వసూలు చేసింది. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి 20 మిలియన్ డాలర్లు 1770 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇండియాలో ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్నది. బాలీవుడ్‌లో ఈ ఏడాది రికార్డు కలెక్షన్లు సాధించిన సయ్యారా సినిమా సినిమా రికార్డును డీమాన్ స్లేయర్ అధిగమించింది. రిలీజ్ తర్వాత ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టి.. రికార్డుల పరంపరను కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











