Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka day 3 collections బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధమాకా.. కెరీర్‌లో బిగ్గెస్ట్‌గా.. 3వ రోజు ఎంతంటే?
మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ధమాకా చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. దర్శకుడు త్రినాథ రావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే అనూహ్యమైన కలెక్షన్లను కురిపిస్తున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే?

అంచనాలకు భిన్నంగా
మాస్, ఫన్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన Dhamaka చిత్రం తొలుత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే రకరకాలుగా వచ్చిన టాక్‌ను అందుకొని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ట్రేడ్ వర్గాల అంచనాలకు భిన్నంగా ధమాకా చిత్రం కాసుల పంటను పండిస్తున్నది. రవితేజ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

3వ రోజు ధమాకా వసూళ్లు
ధమాకా మూవీ సినిమా మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 2.28 కోట్లు, సీడెడ్‌లో 91 లక్షలు, ఉత్తరాంధ్రలో 68 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 29 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 20 లక్షలు, గుంటూరు జిల్లాలో 31 లక్షలు, కృష్ణా జిల్లాలో 34 లక్షలు, నెల్లూరు జిల్లాలో 17 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5.18 కోట్ల షేర్ సాధించింది.

మూడు రోజులు ధమాకా కలెక్షన్లు
ధమాకా మూవీకి సంబంధించి ప్రాంతాల వారీగా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ సినిమా 6 కోట్లు, సీడెడ్‌లో 2.25 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.68 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 73 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 60 లక్షలు, గుంటూరు జిల్లాలో 90 లక్షలు, కృష్ణా జిల్లాలో 79 లక్షలు, నెల్లూరు జిల్లాలో 42 లక్షల రూపాయాలు సాధించింది.

గత మూడు రోజుల్లో ఎంతంటే?
ధమాకా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 4.66 కోట్లు, రెండో రోజున 3.53 కోట్లు, ఆదివారం మూడో రోజున 5.18 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 13.37 కోట్ల షేర్, 22.8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. క్రిస్మస్ సెలవులు కలిసి రావడంతో తొలి వారం ముగిసే సమయానికి ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికాలో భారీగా కలెక్షన్లు
ధమాకా చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. అమెరికాలో ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం గత మూడు రోజుల్లో 200k అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 1.10 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లకుపైగా షేర్, 32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ధమాకా చిత్రం లాభాల్లోకి రావాలంటే?
ధమాకా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 18.5 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 19.5 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా 1 కోటి రూపాయలకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉంది. ఈ వారం ముగింపులో ధమాకా చిత్రం భారీ లాభాలను నమోదు చేసే అవకాశం ఉంది.