twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సారైనా ..? : వైవియస్ చౌదరి 'రేయ్ ' రిలీజ్ డేట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పటికే నాలుగైదు సార్లు విడుదల తేదీలు ప్రకటించి రకరకాల కారణాలతో వాయిదాలు వేస్తూ వస్తున్న వైవియస్ చౌదరి 'రేయ్ ' మరోసారి రిలీజ్ డేట్ ఖారురు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 30న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి హడావిడి ముగియగానే ఈ చిత్రం హంగామా స్టార్టవుతుందన్నమాట. 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రం సక్సెస్ కావటంతో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చి కదలిక వచ్చిందంటన్నారు. బిజినెస్ కూడా ఓహో అనే రేంజిలో లేకపోయినా బాగానే జరుగుతోందంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ''రేయ్‌.. రామ్‌చరణ్‌ కోసం రాసుకొన్న కథ. అయితే సాయిధరమ్‌తేజ్‌లో ఒకప్పటి చిరంజీవిగారి పోలికలు కనిపించాయి. అందుకే తనతో ఈ సినిమా తెరకెక్కించా'' అంటున్నారు వైవీఎస్‌ చౌదరి. ఆయన నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రేయ్‌'. సాయిధరమ్‌తేజ్‌, సయామీఖేర్‌ జంటగా నటించారు. శ్రద్దాదాస్‌ కీలక పాత్రధారి.

    Dharam Tej's Rey readying for release

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''నాకు శిరీష్‌ ఎంతో సాయీ అంతే. చిన్నప్పటి నుంచీ తనకి సినిమాలంటే పిచ్చి. 'సాయిని హీరోని చేసేద్దామా?' అని చరణ్‌ని చాలాసార్లు అడిగా. 'వాడు బుద్ధిగా చదువుకొంటున్నాడు కదా.. వదిలేయ్‌' అన్నాడు. తీరా చూస్తే 'రేయ్‌' సినిమా చేసేశాడు. సాయిని హీరోగా మార్చిన వైవిఎస్‌ చౌదరికి కృతజ్ఞతలు'' అన్నారు. ''నా కష్టం వెనుక బన్నీ అందించిన సహకారం చాలా ఉంది. కుదిరితే వైవిఎస్‌ చౌదరితో మరో సినిమా చేస్తా'' అన్నాడు సాయిధరమ్‌ తేజ్‌.

    వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

    ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

    వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.

    అలాగే...''ఈ సినిమాకి చాలా సమయం పట్టింది. దానికి కారణం... ఈ సినిమాలోని విషయం అలాంటిది. సినిమా చూస్తే ఇంతకాలం ఎందుకు పట్టిందో మీకే అర్థం అవుతుంది'' అన్నారు.చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

    English summary
    Sai Dharam Tej's first film Rey produced and directed by YVS.Chowdhary may finally release in a grand manner. It is coming out that YVS.Chowdhary is planning to release the film on Jan 30th after Sankranthi festive atmosphere reduces.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X