»   » ప్చ్... 'ధృవ', 'శాతకర్ణి'... ఎన్టీఆర్ రికార్డ్ ని రీచ్ కాలేకపోయాయి

ప్చ్... 'ధృవ', 'శాతకర్ణి'... ఎన్టీఆర్ రికార్డ్ ని రీచ్ కాలేకపోయాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈసారి దసరా స్టార్ హీరోల అభిమానుల్ని ఆనందపరిచింది. అయితే అదే సమయంలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టే విషయంలో వెనకబడి నిరాశకు గురి చేసింది. అభిమానులుకు ఈ రోజుల్లో రికార్డ్ లే కదా ప్రాణం. మరి ఆ రికార్డ్ లు రీచ్ అవ్వకపోతే ఎలా...

సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ధృవ, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాల టీజర్లు విడుదలయ్యాయి. టీజర్లలో తమ అభిమాన హీరోలు బాగానే ఇరగదీశారంటూ అబిమానులు సంబరాలు చేసుకున్నారు. అలాగే ఆ రెండు టీజర్లకు పది లక్షల వ్యూస్ దాటాయి. కానీ ఒకటే అడ్డంకి. అదే జనతాగ్యారేజ్ రికార్డ్. దాన్ని అధిగమించలేకపోవటమే కాదు..ఈ రెండు సినిమాలు ఓ సినిమా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి.


ఈ రెండు సినిమాల టీజర్లు ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ రికార్డును అందుకోలేకపోయాయి. జనతాగ్యారేజ్ టీజర్ రికార్డ్ ఏమిటీ అంటే...ఈ టీజర్ విడుదలైన ఆరు గంటల్లోనే పది లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ, ధృవ, శాతకర్ణి సినిమాలకు మాత్రం ఆ వ్యూస్ రావడానికి చాలా సమయమే పట్టిడం జరిగింది. మిలియన్ మార్క్‌ను టచ్ చేయడానికి ధృవకు 17 గంటలు పడితే, గౌతమిపుత్ర శాతకర్ణికి 20 గంటల సమయం పట్టింది.


క్రేజు ఓ రేంజిలో అందుకే

క్రేజు ఓ రేంజిలో అందుకే

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ అనగానే ఆ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. దీని వల్లే ఆ టీజర్‌ను చాలా తక్కువ కాలంలో ఎక్కువ మంది చూసేశారు. దానికి తోడు మోహన్‌లాల్ పాత్ర కూడా కలిసివచ్చింది.


నిజమా..ఇది కారణమా

నిజమా..ఇది కారణమా

పండుగ రోజున ధృవ, గౌతమి పుత్ర శాతకర్ణి టీజర్లను విడుదల చేశారు కాబట్టి.. పండుగ మూడ్‌లో ఉన్న అభిమానులు ఆ టీజర్లను ఎక్కువగా చూడలేకపోయారన్నది కొందరు అంటున్నారు. అయితే తమ హీరో సినిమా టీజర్ ఎప్పుడొప్పుస్తుందా..ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే అభిమానులు చూడకుండా ఉండటమనేది జరగదనేది కొందరి వాదన.


లేకపోతే కష్టమే

లేకపోతే కష్టమే

ఇక, చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150, మహేశ్-మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా, పవన్ కాటమరాయుడు సినిమాల టీజర్లూ త్వరలోనే సందడి చేయబోతున్నాయి. మరి ఆ సినిమాల టీజర్లు జనతాగ్యారేజ్ టీజర్ రికార్డును బద్దలు కొట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారని, ముందస్తుగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఎవేర్ నెస్ తెచ్చి మరీ వదులుతారని చెప్తున్నారు.


ఎక్కడ చూసినా అవే..

ఎక్కడ చూసినా అవే..

దాంతో ఓ ప్రక్కన నందమూరి అభిమానులు, మరో ప్రక్క మెగాభిమానులలో పండగ ఉత్సాహం కనిపించింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అయితే పోటీ వాతావరణం కనిపించింది. రెండు వర్గాల అభిమానులు పోటీ పడి మరీ తమ హీరోల టీజర్లను షేర్ చేయటం , మరో ప్రక్కన పోటీ హీరో టీజర్ ని ట్రోల్ చేయటం కనిపించింది.


పోటీలోకు మధ్యలో ఈ టీజర్ సైతం

పోటీలోకు మధ్యలో ఈ టీజర్ సైతం

అయితే మధ్యలో శర్వానంద్ తాజా చిత్రం శతమానం భవతి టీజర్ కూడా రిలీజయ్యింది. ఈ టీజర్ కు సైతం మంచి మార్కులే పడ్డాయి. మూడు టీజర్లను మీరు ఈ క్రింద చూడవచ్చు. అలాగే ఏ టీజర్ బాగుందో ఇక్కడ కామెంట్ కాలంలో పంచుకోవచ్చు.


బాలయ్య బాబు అరిపించాడు

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ టీజర్ వచ్చేసింది. ‘సమయం లేదు మిత్రమా.... శరణమా... రణమా' అంటూ సాగిన ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


చెర్రీ కేక పెట్టించాడు

ధృవ టీజర్ లో అయితే చెర్రి గ్రాండ్ లుక్ తో అదరగొట్టాడు. అంతేకాదు నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది అని డైలాగ్ చెప్పాడు. సినిమా మొత్తం మైండ్ గేం తో నడుస్తుందని తెలిసిందే. ఆల్రెడీ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ గా ధ్రువ ఈసారి మెగా ఫ్యాన్స్ కు పండుగ తెస్తుందని నమ్ముతున్నారు.


ఇదీ బాగుంది

శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శతమానం భవతి'. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.


English summary
Dhruva, Gautamiputra Satakarni, both these teasers failed to beat the record set by NTR's 'Janatha Garage' teaser, which clocked 1 million views in just 6 hours. The festival mood has also shown considerable impact on the views.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu