Dies Irae Day 2 Box Office Collections: డైస్ ఇరే సంచలన వసూళ్లు.. ప్రణవ్ మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రణవ్ మోహన్‌లాల్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డైస్ ఇరే. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రణవ్ సరసన సుస్మిత భట్ హీరోయిన్‌గా నటించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు డైస్ ఇరే మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
డైస్ ఇరే బడ్జెట్ ఎంత?
నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవరి రామచంద్ర, ఎస్ శశికాంత్ ఈ డైస్ ఇరే మూవీని సంయుక్తంగా నిర్మించారు. జిబిన్ గోపినాథ్, జయ కురూప్, అరుణ్ అజికుమార్, సైజు కురూప్, శ్రీధన్య, మదన్ బాబు, సుధా సుకుమారి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. షెహనాద్ జలాల్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందించగా.. షఫీఖ్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్, క్రిస్టో జేవియర్ సంగీత దర్శకత్వం వహించారు. నటీనటులు, సాంకేతి నిపుణుల రెమ్యునరేషన్, ఇతర ఖర్చులు కలిపి డైస్ ఇరే మూవీకి దాదాపు 12 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

డైస్ ఇరే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, ప్రణవ్ మోహన్‌లాల్ క్రేజ్‌తో ఈ సినిమాపై మలయాళ పరిశ్రమలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. హర్రర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాకు కేరళలో మంచి వసూళ్లు వస్తాయన్న సంగతి తెలిసిందే. దీనికి తగినట్లుగానే డైస్ ఇరే ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఈ చిత్రాన్ని కేరళలో థింక్ స్టూడియెస్, ఈ 4 ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇండియాలో పంపిణీ చేస్తున్నాయి. అలాగే ఓవర్సీస్‌లో బెర్క్‌షైర్ డ్రీమ్ హౌస్ సంస్థ పంపిణీ చేస్తోంది. హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులు సొంతం చేసుకుంది. డైస్ ఇరే చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
డైస్ ఇరే తొలి రోజు కలెక్షన్స్
డైస్ ఇరే చిత్రానికి ప్రీమియర్స్‌తో కలుపుకుని తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. ఇండియాలో 4.7 కోట్ల రూపాయల నెట్, 5.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. ఓవర్సీస్‌లో ఈ సినిమా తిరుగులేని విధంగా సత్తా చాటుతోంది. నార్త్ అమెరికాతో పాటు మలయాళీలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూరప్ తదితర దేశాలో ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి డైస్ ఇరే చిత్రానికి వరల్డ్ వైడ్‌గా తొలి రోజు 10.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
డైస్ ఇరే రెండో రోజు కలెక్షన్స్
ప్రణవ్ మోహన్‌లాల్ చిత్రానికి రెండో రోజు సాలీడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తొలి రోజును మించి రెండో రోజు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రణవ్ మోహన్ లాల్ చిత్రానికి మలయాళంలో 47 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. దాంతో డైస్ ఇరే సినిమాకు రెండో రోజు వరల్డ్ వైడ్‌గా 7 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











