Dies Irae Day 3 Collections: డైస్ ఇరే వసూళ్ల జోరు... మూడో రోజు ప్రణవ్ మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన లేటెస్ట్ మూవీ డైస్ ఇరే. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రణవ్ సరసన సుస్మిత భట్ హీరోయిన్‌గా నటించారు. హార్రర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు డైస్ ఇరే మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

డైస్ ఇరే బడ్జెట్ ఎంత?
నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవరి రామచంద్ర, ఎస్ శశికాంత్‌ ఈ డైస్ ఇరే మూవీని సంయుక్తంగా నిర్మించారు. జిబిన్ గోపినాథ్, జయ కురూప్, అరుణ్ అజికుమార్, సైజు కురూప్, శ్రీధన్య, మదన్ బాబు, సుధా సుకుమారి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. షెహనాద్ జలాల్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందించగా.. షఫీఖ్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్, క్రిస్టో జేవియర్ సంగీత దర్శకత్వం వహించారు. నటీనటులు, సాంకేతి నిపుణుల రెమ్యునరేషన్, ఇతర ఖర్చులు కలిపి డైస్ ఇరే మూవీకి దాదాపు 12 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Dies Irae Day 3 expected Box Office Collections Worldwide Pranav Mohanlal s movie registered good occupancy

డైస్ ఇరే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తగినట్లుగానే డైస్ ఇరే ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఈ చిత్రాన్ని కేరళలో థింక్ స్టూడియెస్, ఈ 4 ఎంటర్‌‌టైన్‌మెంట్ సంస్థ ఇండియాలో పంపిణీ చేస్తున్నాయి. ఓవర్సీస్‌లో బెర్క్‌షైర్ డ్రీమ్ హౌస్ సంస్థ పంపిణీ చేస్తోంది. హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులు సొంతం చేసుకుంది. డైస్ ఇరే చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

డైస్ ఇరే రెండు రోజుల కలెక్షన్స్
24 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జర్నీ మొదలుపెట్టిన డైస్ ఇరే చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సంచలన విజయం సాధించింది. డైస్ ఇరే చిత్రానికి ప్రీమియర్స్‌తో కలుపుకుని తొలిరోజు ఇండియాలో 4.7 కోట్ల రూపాయలు, రెండో రోజున 5.75 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇక ఓవర్సీస్‌లో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నార్త్ అమెరికాలో డైస్ ఇరేకు ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజున 84K (భారత కరెన్సీలో 74.57 లక్షల రూపాయలు) వచ్చాయి. రెండో రోజు రాత్రి 7 గంటల వరకు 98K డాలర్లు వసూలైంది. మొత్తంగా రెండ్రోజుల్లో ఒక్క నార్త్ అమెరికాలోనే డైస్ ఇరే మూవీకి 2 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో 1.77 కోట్ల రూపాయలు) వసూలైంది. అలాగే యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో కలిపి 5 కోట్ల రూపాయలు చొప్పున ఓవర్సీస్‌లో రెండు రోజుల వరకు 6.7 కోట్ల రూపాయలు రాబట్టాడు ప్రణవ్. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి డైస్ ఇరే చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రెండ్రోజుల వరకు 18.1 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

డైస్ ఇరే మూడో రోజు కలెక్షన్స్
బాహుబలి ది ఎపిక్ సహా పలు చిన్న పెద్దా సినిమాలు బరిలో ఉన్నప్పటికీ డైస్ ఇరే మూవీ మంచి హోల్డ్ చూపిస్తోంది. 3వ రోజు ఆదివారం వీకెండ్ కావడంతో బుకింగ్స్ బాగా జరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మలయాళంలో 64 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. దాంతో డైస్ ఇరే మూవీకి మూడో రోజు వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X