twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహాసముద్రం నష్టాలు.. వాళ్ళు అడగడంతో క్షమాపణలు చెప్పిన దర్శకుడు.. రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎవరంటే?

    |

    మన సముద్రం సినిమా విడుదలకు ముందు ఓ వర్గం ప్రేక్షకులలో అయితే అంచనాలను భారీస్థాయిలో క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా మొత్తానికి నెగిటివ్ రిజల్ట్ తోనే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా దారుణమైన నష్టాలను చూడాల్సి వచ్చింది. అయితే ఇటీవల దర్శకుడు అజయ్ భూపతి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి క్షమాపణలు కూడా చెప్పాడు.

    రిజెక్ట్ చేసిన హీరోలు

    రిజెక్ట్ చేసిన హీరోలు

    ఆర్ఎక్స్ 100 సినిమాతోనే మంచి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అజయ్ భూపతి ఆ తరువాత బడా నిర్మాతల నుంచి కూడా చాలా ఆఫర్స్ అందుకున్నాడు. అయితే అతను ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వకుండా రెండో కథను సిద్ధం చేసిన తర్వాతనే నిర్మాతలను కలవాలని అనుకున్నాడు. ఆ విధంగా ఆలోచించే మహాసముద్రం కొంత మంది హీరోలకు నిర్మాతలకు విడిపించాడు. అయితే ఆ సినిమా చేయడానికి స్టార్ హీరోలు కొందరు రిస్క్ చేయడానికి వెనుకడుగు వేశారు. అందులో రవితేజ, నితిన్, నాగచైతన్య, రామ్, నాని కూడా ఉన్నారు.

    విడుదలకు ముందు

    విడుదలకు ముందు

    మహా సముద్రం సినిమా విడుదలకు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిద్దార్థ్ శర్వానంద్ ఇద్దరు కూడా కలిసి నటిస్తూ ఉన్నారు అని తెలియడంతోనే ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అలాగే ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. దీంతో సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనే భారీ స్థాయిలోనే విడుదల చేశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని దర్శకుడు కూడా ప్రమోషన్స్ లో ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించాడు.

    హిట్ కొట్టాలని అనుకున్న హీరోలు

    హిట్ కొట్టాలని అనుకున్న హీరోలు

    అయితే మహా సముద్రం సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమయింది. సినిమా ఏమాత్రం బాగోలేదని చాలా రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకున్నాడు. శర్వానంద్ కూడా ఈ సినిమాలో మరో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి తెలుగులో మంచి విజయాన్ని అందుకోవాలని అనుకున్న సిద్దార్థ్ కి కూడా చేదు అనుభవాన్ని ఇచ్చింది.

    నష్టం ఎంతంటే?

    నష్టం ఎంతంటే?

    బాక్సాఫీస్ వద్ద మహా సముద్రం సినిమా 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయింది. ఇక సినిమా 11.25 కోట్ల గ్రాస్ అందుకుంది. డిస్ట్రిబ్యూటర్ షేర్ 6.44 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. అంటే ఫైనల్ గా సినిమా పెట్టిన పెట్టుబడితో పోలిస్తే థియేట్రికల్ గా 7.56 కోట్ల వరకు నష్టం కలుగజేసినట్లు తెలుస్తోంది. ఒక విధంగా నిర్మాతకు ఇది భారీ నష్టాలను మిగిల్చింది.

    Recommended Video

    Romantic Movie Premiere - Celebrities Response | Akash Puri, Ketika Sharma ​| Filmibeat Telug
    క్షమాపణ చెప్పిన దర్శకుడు

    క్షమాపణ చెప్పిన దర్శకుడు

    రీసెంట్ గా సోషల్ మీడియాలో దర్శకుడు అజయ్ భూపతిని ఓ వర్గం నెటిజన్లు సినిమా రిజల్ట్ పై ప్రశ్నించడం జరిగింది. అజయ్ కూడా క్షమాపణలు చెప్పాడు. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. నెక్స్ట్ రాబోయే కథతో తప్పకుండా మిమ్మల్ని సంతృప్తి పరుస్తాను అంటూ చాలా పాజిటివ్ గా స్పందించడంతో కొంతమంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    English summary
    Director ajay bhupathi about maha samudram final result
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X