twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముంభైలో 'దూకుడు' రిజల్టు!?

    By Srikanya
    |

    సాధారణంగా ముంబైలో మన తెలుగు సినిమాలుకు డిమాండ్ తక్కువే. కేవలం తెలుగు వాళ్లను దృష్టిలో పెట్టుకునే అక్కడ మన సినిమాలు విడుదల చేస్తారు. ఈ నేపధ్యంలో మహేష్ 'దూకుడు" ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 13 థియేటర్ లలో విడుదల చేసారు. వారి అంచనాలకు తగినట్లుగానే ముంబై లోనూ 'దూకుడు" సినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకూ దూకుడు ముంబైలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. అంతే కాదు నాగపూర్, పూనే లలో కూడా ఈ చిత్రం పలు సినిమా ధియోటర్స్ లో విడుదలై మంచి కలెక్షన్స్ సంపాదిస్తోంది. సాధారణంగా ఇక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చాక అక్కడ నెల దాటాక సినిమాలను విడుదల చేస్తూంటారు. అలాంటిది తెలుగులో రిలీజ్ రోజే అక్కడా విడుదల చేయటం అక్కడ ప్రేక్షకులను సంతోషపరుస్తోంది. దాంతో మొదటివారంలోనే ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మంచి లాభాలు పొందాలన్న నిర్మాతలు వ్యూహం సక్సెస్ అయినట్లైంది.

    మరో ప్రక్క చెన్నైలో ఈ సినిమా 15 థియేటర్లలో రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ ఇచ్చింది.దీనికి తోడు దూకుడు ఇప్పుడు బెంగుళూరు నగరంలో సరికొత్త రికార్డుల మోతతో విజయవంతంగా నడుస్తోంది. ఈ సినిమా విదేశాల్లో 'దబాంగ్‌" రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్‌ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. తొలి మూడు రోజుల్లో రూ. 21.22 కోట్ల షేర్‌ని వసూలు చేసి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుని సాధించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాతలు చెప్తున్నారు. అమెరికాలో మూడు రోజుల్లో 15 లక్షల డాలర్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైంది.

    English summary
    Mahesh Babu’s high voltage action and comedy entertainer Dookudu has been doing phenomenally well across Andhra Pradesh and records are falling by the wayside.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X