»   » టాక్ సూపర్...కలెక్షన్స్ మాత్రం సోసో

టాక్ సూపర్...కలెక్షన్స్ మాత్రం సోసో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొంది విడుదలైన చిత్రం 'దృశ్యం'. ఓపినింగ్స్ పెద్దగా తెచ్చుకోలేక పోయిన ఈ చిత్రం బడ్జెట్, బిజినెస్ పరంగా భాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్లే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. బి,సి సెంటర్ల వద్ద కలెక్షన్స్ సాధించలేకపోతున్న ఈ చిత్రం ఎ,మల్టిఫ్లెక్స్ సెంటర్లలలో బాగానే కలెక్టు చేస్తోంది. అయితే తొలిరోజు రివ్యూలను చూసి అంచనా వేసినంత ఘనంగా మాత్రం కలెక్షన్స్ కనపడటం లేదు.

ముఖ్యంగా వీకెండ్స్ లో ఈ చిత్రం ఫ్యామిలీలను ఎట్రాక్ట్ చేస్తోంది. వీకెండ్ షేర్ 6.1 వచ్చిందని, పది కోట్లు వరకూ ఫస్ట్ వీక్ షేర్ కలెక్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో శాటిలైట్ రైట్స్ తో కలిపి చూస్తే పూర్తి సేఫ్ అని, లాభాల్లో ఉన్నట్లే తేల్చారు. ఒరిజనల్ చూసిన వారికి ఈ చిత్రం పెద్దగా ఆనకపోయినా, తెలుగులో మాత్రమే చూసేవారికి చిత్రం ఆకట్టుకుంటోంది

Drushyam puts up a strong showing on Weekdays


ఇక దర్శకురాలు శ్రీప్రియ తన దర్శకత్వ ప్రతిభ ని కేవలం అక్కడ సీన్స్ ని ఇక్కడ అనువదించటానికి మాత్రమే ఉపయోగించని విమర్శలు వినపడ్డాయి. అయితే వెంకటేష్ మాత్రం భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా చేయడంతో, అతనికో ల్యాండ్ మార్క్ సినిమాగా మారుతుందని అంటున్నారు.

మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ హిట్ సినిమా 'దృశ్యం'కు రీమేక్ ఇది. డా.డి.రామానాయుడు సమర్పించారు. వెంకటేష్ తొలిసారి ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా నటించారు. మీనా కీలక పాత్రధారి. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అరకు, విజయనగరం, వైజాగ్, హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేసారు.

నరేష్, నదియ, రవి కాలే, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సమర్పణ: డా.డి.రామానాయుడు, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: శరత్, కథ: జీతూ జోసెఫ్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: స్వామి, ఆర్ట్: వివేక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సురేష్ బాలాజి, జార్జ్ పైయస్.

English summary

 
 Venkys Drushyam is doing pretty good on Weekdays. The film as expected is doing well in A Centres than B & Cs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu