»   » దృశ్యం: బడ్జెట్ ఎంత? ఎంత కలెక్ట్ చేయొచ్చు?

దృశ్యం: బడ్జెట్ ఎంత? ఎంత కలెక్ట్ చేయొచ్చు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్, మీనా కాంబినేషన్ లో మళయాళి రీమేక్ గా రూపొందిన చిత్రం 'దృశ్యం'. ఈ శుక్రవారం విడుదలై మార్నింగ్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఓపినింగ్స్ అంతంత మాత్రంగా ఉండటంతో కొద్దిగా ఇబ్బంది అనిపించినా మౌత్ టాక్ తో పికప్ అయ్యింది. ఈ చిత్రం ఎపి,తెలంగాణాలో మొదటి రెండు రోజులు 2.75 కోట్లు కలెక్టు చేసింది. బయిట ప్రచారంలో ఉన్న లెక్కల చెప్తున్న ప్రకారం(వెంకి రెమ్యునేషన్ తో కలిపి) 8 కోట్లు అయ్యిందని, అయితే వెంకి రెమ్యునేషన్ కాకుండానే ఎనిమిది అయ్యిందని నిర్మాతకు చెందిన వారు చెప్తున్నారు. అయితే ఈ చిత్రం దాదాపు 25 కోట్లు వరకూ కలెక్టు చేసే అవకాసం ఉందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.

చిత్రం కథ విషయానికి వస్తే...తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.

'Drushyam': Rs 8 crore Film to earn Rs 25 crore!

నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దారు. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరిచాం. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కించటమే కలిసి వచ్చింది' అంటున్నారు.

మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించటం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది.

నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్‌ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్‌ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.

English summary

 'Drushyam' is expected to collect a share of over Rs 25 crore in the full run.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu