Dude Closing Collection: డ్యూడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ప్రదీప్ రంగనాథన్ మూవీకి లాభమా? నష్టమా?

టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్ నిర్మించిన చిత్రం డ్యూడ్. కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, ప్రేమలు ఫేమ్ మమితా బైజు, నేహా శెట్టిలు లీడ్ రోల్ పోషించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. డ్యూడ్ చిత్రానికి కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అక్టోబర్ 17వ తేదీన డ్యూడ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? డ్యూడ్‌కి లాభమెంత? నష్టమెంత? క్లోజింగ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు పరిశీలిస్తే..

డ్యూడ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్, టీజర్, ట్రైలర్లతో డ్యూడ్ మూవీకి మంచి బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల రూపాయల షేర్... 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Dude Box Office Closing Collections Worldwide How much loss or profit for Pradeep Ranganathan s Movie

ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడులో 31 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. డ్యూడ్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 550 స్క్రీన్‌లలో విడుదల చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

డ్యూడ్ కలెక్షన్స్
డ్యూడ్ చిత్రానికి తొలి రోజున ఇండియా వైడ్‌గా 9.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 10.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 10.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10.8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8.75 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 4 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.2 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.4 కోట్ల రూపాయలు, పదవ రోజున 3.5 కోట్ల రూపాయలు, పదకొండవ రోజున 1.35 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 1.25 కోట్ల రూపాయలు, పదమూడవ రోజున 1.1 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 1.05 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 70 లక్షల రూపాయలు, పదహారో రోజున 1.35 కోట్ల రూపాయలు, పదిహేడో రోజున 1.4 కోట్ల రూపాయలు, పద్దెనిమిదవ రోజున 21 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 72.2 కోట్ల రూపాయల నెట్.. 84.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది డ్యూడ్. ఇండియాలో తొలి వారం 27.25 కోట్ల రూపాయలు, రెండో వారం 13.6 కోట్ల రూపాయలు రాబట్టింది డ్యూడ్.

ఓవర్సీస్‌లో డ్యూడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే... కాంతార చాప్టర్ 1, బాహుబలి ది ఎపిక్, కే ర్యాంప్, మాస్ జాతర వంటి సినిమాలు థియేటర్స్‌లో ఉన్నప్పటికీ నార్త్ అమెరికాలో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది డ్యూడ్. ఇప్పటి వరకు అక్కడ 780K ( భారత కరెన్సీలో దాదాపు 7 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో 21 కోట్ల రూపాయలు వసూలు చేశాడు ప్రదీప్. దాంతో ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు డ్యూడ్ కలెక్షన్స్ మొత్తం 28 కోట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి డ్యూడ్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 112.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే ... తొలి రోజున 3.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.9 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు, ఏడో రోజున 50 లక్షల రూపాయలు, ఎనిమిదవ రోజున 45 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 65 లక్షల రూపాయలు, పదవ రోజున 70 లక్షల రూపాయలు, పదకొండో రోజున 35 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 30 లక్షల రూపాయలు, పదో మూడో రోజున 20 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 20 లక్షల రూపాయలు, పదిహేనో రోజున 9 లక్షల రూపాయలు, పదహారో రోజున 11 లక్షల రూపాయలు, పదిహేడో రోజున 13 లక్షల రూపాయలు, పద్దెనిమిదో రోజున 4 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ 16.12 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది.

ఇండియాలో ఏరియాల వారీగా డ్యూడ్ కలెక్షన్స్ చూస్తే.. కర్ణాటకలో 6.42 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 17.57 కోట్ల రూపాయలు, తమిళనాడులో 54.4 కోట్ల రూపాయలు, కేరళలో 3.52 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 75 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది.

డ్యూడ్ లాభమెంత నష్టమెంత? నష్టమెంత?
వరుస విజయాల్లో ఉన్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్‌తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. వరుసగా మూడోసారి 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లో చేరాడు. తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను డ్యూడ్ మూవీకి ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల షేర్ రాగా.. 3 కోట్ల రూపాయల నష్టంతో బిజినెస్ క్లోజ్ చేసింది. తమిళనాడులో 32 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 27 కోట్ల రూపాయల షేర్‌తో సరిపెట్టుకుంది. అయితే తమిళనాడులో ఈ సినిమా మరికొద్దిరోజులు రన్ అయ్యే పరిస్ధితులు ఉండటంతో లాంగ్ రన్‌లో స్వల్ప నష్టాలతో బయటపడే అకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఓవరాల్‌గా 120 కోట్ల రూపాయల గ్రాస్.. 61 కోట్ల రూపాయల షేర్‌ రాబట్టాల్సి ఉండగా డ్యూడ్‌ మరో 10 కోట్ల రూపాయల నష్టంతో నిలిచింది. అయితే డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రైట్స్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సేఫ్ జోన్‌లోకి వచ్చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X