Dude Box Office: అడ్వాన్స్ బుకింగ్‌లో డ్యూడ్ క్రేజ్.. రిలీజ్‌కు ముందు ప్రదీప్ రంగనాథన్ సరికొత్త చరిత్ర

లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో యూత్ స్టార్‌గా ఎదిగారు ప్రదీప్ రంగనాథన్. కోలీవుడ్‌కు చెందిన ఈ హీరో.. సిక్స్ ప్యాక్ బాడీ, వైట్ స్కిన్ టోన్ వంటివి లేకపోయినా కేవలం కథను నమ్మి, తన ప్రతిభతో ఇక్కడి దాకా చేరుకున్నారు. తాజాగా ప్రదీప్ నటించిన మూవీ డ్యూడ్. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. దీంతో యువత ఈ సినిమా చూసేందుకు ఎగబడుతోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్‌తోనే ప్రదీప్ రంగనాథన్ సరికొత్త కొత్త చరిత్ర సృష్టించారు. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగులో బడా నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్‌ తమిళంలోనూ నిలదొక్కుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా పలువురు కోలీవుడ్ స్టార్స్‌తో వరుసగా సినిమాలు తీస్తోంది. ఈ క్రమంలో ప్రదీప్ రంగనాథన్‌తో డ్యూడ్ సినిమా నిర్మించింది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు, డీజే టిల్లూ ఫేమ్ నేహా శెట్టిలు హీరోయిన్‌లుగా నటించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. డ్యూడ్ చిత్రానికి సుధ కొంగర వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ సంగీత సారథ్యం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు.

Dude Day 1 Advance Booking Collections Worldwide Pradeep Ranganathan s Movie Box office Report details

డ్యూడ్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రదీప్ బాక్సాఫీస్ హిస్టరీ, అతని ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో డ్యూడ్ మూవీకి తమిళ్, తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డ్యూడ్ మూవీ థియేట్రికల్ రైట్స్‌ను తొలుత రోమియో పిక్చర్స్ సంస్థ దక్కించుకుంది. అయితే అనివార్య కారణాలతో ఈ సంస్థ తప్పుకోవడంతో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ హక్కులను సొంతం చేసుకుంది.

డ్యూడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఓవర్సీస్‌లో డ్యూడ్ చిత్రానికి ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా, నైజాంలలో డ్యూడ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 10 కోట్ల రూపాయల షేర్ రాబట్టాలని తెలిపారు.

అడ్వాన్స్ బుకింగ్‌లో డ్యూడ్ రికార్డ్
రిలీజ్‌కు కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండగా.. నార్త్ అమెరికా, ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాలలో డ్యూడ్ చిత్రానికి ప్రీమియర్స్ షోలు ప్రదర్శించనున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. అయితే అమెరికాలో డ్యూడ్‌కి తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌లోనే ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 15వ తేదీ వరకు డ్యూడ్‌కి అమెరికాలోని 263 సెంటర్లలో 578 షోలకు గాను 3989 టికెట్స్ అమ్ముడయ్యాయి. దాంతో తమిళ వెర్షన్‌కు 27 వేల డాలర్లు, తెలుగు వెర్షన్‌కు 32 వేల డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. ఇక ఇండియాలో అన్ని రాష్ట్రాలలో కలిపి 18.90 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X