Dude Day 1 Box Office: షాకింగ్‌గా డ్యూడ్ కలెక్షన్లు.. ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Dude Box Office Collections: లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో యూత్ స్టార్‌గా ఎదిగాడు ప్రదీప్ రంగనాథన్. తన ప్రతిభతో, కథలతోనే కోట్లాది ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం "డ్యూడ్" అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు( నేడు) పాజివిట్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో డ్యూడ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే?
కోలీవుడ్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై. రవిశంకర్, నవీన్ యెర్నెని నిర్మించగా, కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు. తమిళ పరిశ్రమలో సుధ కొంగర వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన, డ్యూడ్‌తో ఫుల్ లెంగ్త్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. హర్షిత్ మల్గిరెడ్డి, మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్స్‌గా నటించగా, శరత్ కుమార్, రోహిణి, సత్య వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఇక
సాంకేతికంగా కూడా డ్యూడ్ టీమ్ శ్రద్ధ పెట్టింది. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, భరత్ విక్రమన్ ఎడిటింగ్, సాయి అభయాంకర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. యూత్‌కి నచ్చే థీమ్, ఎంటర్టైనింగ్ స్క్రీన్‌ప్లే, కామెడీతో పాటు థ్రిల్లింగ్ టచ్ ఉండటం వల్ల ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

బడ్జెట్ అండ్ ఫ్రీ బిజినెస్ వివరాలు
డ్యూడ్ చిత్రం మొత్తం 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఇందులో నటీనటుల రెమ్యునరేషన్, టెక్నీషియన్ల వేతనాలు, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలుపుకుని ఈ బడ్జెట్ ఖర్చు అయింది. తమిళనాడులో థియేట్రికల్ రైట్స్ మొదట రోమియో పిక్చర్స్ తీసుకున్నా, తరువాత ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ హక్కులు సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో ప్రత్యంగిరా సినిమాస్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ మూవీ బిజినెస్ 10 కోట్ల రూపాయలు దాటింది. అందులో నైజాంలో రూ. 4.5 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.5 కోట్లు, ఆంధ్రలో రూ. 4 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే, మొత్తం బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల షేర్ లేదా 22 కోట్ల గ్రాస్ సాధించాలి. తమిళనాడులో రూ. 31 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా నుంచి 6 కోట్లు, ఓవర్సీస్ నుంచి 12 కోట్లు మొత్తంగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 59 కోట్లు వసూళ్లు అయితే.. హిట్ అవ్వాలంటే కనీసం రూ. 120 కోట్ల గ్రాస్ వసూలు కావాల్సి ఉంటుంది.
అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్:
రిలీజ్‌కు ముందు నుంచే డ్యూడ్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో మాత్రమే 314 సెంటర్లలో 686 షోలకు గాను 5,969 టికెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు వెర్షన్ $46K, తమిళ్ వెర్షన్ $42K వసూలు చేసి, మొత్తం $88K (భారత కరెన్సీలో సుమారు ₹78 లక్షలు) సంపాదించింది. ఇక ఇండియాలో తమిళ్ వెర్షన్‌కు 1,80,862 టికెట్లు అమ్ముడై రూ. 2.93 కోట్లు, తెలుగు వెర్షన్‌కు 62,801 టికెట్లు అమ్ముడై రూ. 9.54 లక్షలు వసూలయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా మొత్తంగా రూ.3.89 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చాయి. ఓవర్సీస్ కలిపితే మొత్తం రూ. 4.67 కోట్లు గ్రాస్‌గా వచ్చింది.
డ్యూడ్ కలెక్షన్స్
"డ్యూడ్" తొలి మొదటి రోజే థియేటర్లలో మంచి హడావుడి సృష్టించింది. లవ్ టుడే, డ్రాగన్ వంటి హిట్స్ తర్వాత ప్రదీప్‌పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓపెనింగ్స్ దూసుకుపోతున్నాయి. పాజిటివ్ రివ్యూలు, సూపర్ మౌత్‌టాక్‌తో ఈ మూవీకి అన్ని వయసుల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సాక్‌నిక్ రిపోర్ట్స్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు "డ్యూడ్" మూవీకి 14% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. అర్బన్ సెంటర్లలో, మల్టీప్లెక్స్‌లలో బుకింగ్స్ వేగంగా పెరుగుతున్నాయి. ఫస్ట్ షో తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగా సెకండ్ షోలకే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, "డ్యూడ్" మొదటి రోజున తెలుగు, తమిళనాడు రాష్ట్రాలు, ఇండియాలో కలిపి రూ. 3. 27 కోట్లు నెట్ కలెక్షన్స్, ఓవర్సీస్ కలిపి రూ. 4.8 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ చిత్రం రూ. 5.5 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు టాక్. ఇక రెండో రోజు నుండి బుకింగ్స్ మరింత వేగంగా పెరుగుతాయని, వీకెండ్ కల్లా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











