Dude Day 14 Collections: భారీగా క్షీణించిన డ్యూడ్ వసూళ్లు... ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇంకెంత రావాలంటే?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం డ్యూడ్. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి లీడ్ రోల్స్ పోషించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మ తదితరులు నటించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా... సాయి అభయాంకర్ సంగీత దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో డ్యూడ్ బడ్జెట్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 14వ రోజు కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే..

డ్యూడ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ సినిమాకు సుమారుగా 60 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో డ్యూడ్ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల రూపాయల షేర్... 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

Dude Day 14 expected Box Office Collections Worldwide Pradeep Ranganathan movie Collections have fallen

డ్యూడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తెలుగు రాష్ట్రాలు మినహాయించి ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడులో 31 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. డ్యూడ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టాల్సి ఉందని విలువ కట్టారు. డ్యూడ్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 550 స్క్రీన్‌లలో విడుదల చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

డ్యూడ్ 14 రోజుల కలెక్షన్స్
డ్యూడ్ చిత్రానికి తొలి రోజున ఇండియా వైడ్‌గా 9.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 10.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 10.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10.8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8.75 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 4 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.2 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.4 కోట్ల రూపాయలు, పదవ రోజున 3.5 కోట్ల రూపాయలు, పదకొండవ రోజున 1.35 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 1.25 కోట్ల రూపాయలు, పదమూడవ రోజున 1.1 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో 13 రోజుల వరకు డ్యూడ్ మూవీకి ఇండియాలో 69.1 కోట్ల రూపాయల నెట్.. 81.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

డ్యూడ్ ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే... బాహుబలి ది ఎపిక్ థామా వంటి చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ నార్త్ అమెరికాలో ప్రదీప్ రంగనాథన్ చిత్రానికి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. బుధవారం 11K డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 10 లక్షల రూపాయలు) వసూలు చేసింది. 13 రోజుల వరకు యూఎస్ఏ, కెనడాలలో డ్యూడ్ మూవీకి 771K (భారత కరెన్సీలో 6.83 కోట్ల రూపాయలు) డాలర్ల వసూలు చేసింది. ఇక మిగిలిన దేశాల నుంచి 22 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో డ్యూడ్ సినిమాకు ఓవర్సీస్ నుంచి 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలిపి డ్యూడ్ చిత్రానికి 13 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 109 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే ... తొలి రోజున 3.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.9 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు, ఏడో రోజున 50 లక్షల రూపాయలు, ఎనిమిదవ రోజున 45 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 65 లక్షల రూపాయలు, పదవ రోజున 70 లక్షల రూపాయలు, పదకొండో రోజున 35 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 30 లక్షల రూపాయలు, పదో మూడో రోజున 20 లక్షల రూపాయలు చొప్పున 15.55 కోట్ల రూపాయలు నికర వసూళ్లు వచ్చాయి.

ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే... తమిళనాడులో 53.60 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 17.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.32 కోట్ల రూపాయలు, కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.40 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 28 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.

డ్యూడ్ 14వ రోజు వసూళ్లు
సోమవారం నుంచే డ్యూడ్ చిత్రానికి బుకింగ్స్ పడిపోగా.. బాహుబలి ది ఎపిక్, మాస్ జాతర రిలీజ్ కారణంగా చాలా రూరల్ ఏరియాలలో ప్రదీప్ రంగనాథన్ సినిమాను ఎత్తేశారు. 14వ రోజు సాయంత్రం 5 గంటల వరకు డ్యూడ్‌కు తమిళంలో 13 శాతం, తెలుగులో 12 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో 14వ రోజు ప్రదీప్ రంగనాథన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయల కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. డ్యూడ్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X