Dude Day 4 Box Office Collections: 100 కోట్లకు చేరువగా డ్యూడ్... మరో రికార్డ్‌పై కన్నేసిన ప్రదీప్ రంగనాథన్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, ప్రేమలు ఫేమ్ మమితా బైజు, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం డ్యూడ్. దీపావలి కానుకగా అక్టోబర్ 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించగా... కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ సంగీత దర్శకుడిగా నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగవ రోజు ఈ సినిమా ఎన్నికోట్లు రాబట్టిందో చూస్తే..

డ్యూడ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్, టీజర్, ట్రైలర్లతో డ్యూడ్ మూవీకి మంచి బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల రూపాయల షేర్... 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు తెలిపారు.

Dude Day 4 expected Box Office Collections Worldwide Pradeep Ranganathan movie heading towards 100 crores

ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడులో 31 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టాల్సి ఉంది. డ్యూడ్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 550 స్క్రీన్‌లలో విడుదల చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

డ్యూడ్ మూడు రోజుల కలెక్షన్స్
120 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గె‌ట్‌తో బరిలోకి దిగిన డ్యూడ్ చిత్రానికి తొలి రోజున ఇండియా వైడ్‌గా 9.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 10 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు వచ్చాయి. దీంతో మూడు రోజుల వరకు ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇండియాలో 30.75 కోట్ల రూపాయల నెట్.. 36.25 కోట్ల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటికే నార్త్ అమెరికాలో 500K( భారత కరెన్సీలో 4.39 కోట్ల రూపాయలు) మార్క్‌ను దాటేసింది. ఆదివారం రాత్రి 7 గంటల వరకు నార్త్ అమెరికాలో డ్యూడ్ చిత్రానికి 70K డాలర్లు (భారత కరెన్సీలో 61.53 లక్షల రూపాయలు) రాబట్టింది. దీంతో డ్యూడ్ చిత్రం నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన దేశాల నుంచి ప్రదీప్ రంగనాథన్ మూవీకి 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో మొత్తంగా ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు 16 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 4 రోజుల్లో 53 కోట్ల రూపాయలు రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ చిత్రానికి తొలి రోజున 3.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.9 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో 8.75 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయి. మూడు రోజుల్లో తమిళనాడులో 22 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 8.75 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 16 కోట్ల రూపాయలు రాబట్టింది డ్యూడ్. అయితే డ్యూడ్ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 66 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.

డ్యూడ్ నాలుగో రోజు వసూళ్లు
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో సోమవారం ప్రదీప్ రంగనాథన్ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. కాంతార చాప్టర్ 1, మిత్రమండలి, కే ర్యాంప్, తెలుసు కదా తదితర సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ డ్యూడ్ దూసుకెళ్తూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు డ్యూడ్‌కి తమిళంలో 30 శాతం, తెలుగులో 23 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ప్రదీప్ రంగనాథన్ సినిమాకు నాలుగో రోజున తమిళంలో 7 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, కేరళ+ కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 11 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డ్యూడ్ చిత్రం త్వరలోనే ప్రదీప్ రంగనాథన్ మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X