Dude Day 5 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద డ్యూడ్ జోరు... ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కీర్తీశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి లీడ్ రోల్స్ పోషించిన మూవీ డ్యూడ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ ఈ సినిమాను నిర్మించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు కీలక పాత్రలు పోషించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ సంగీత దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదవ రోజు ఈ సినిమా ఎన్నికోట్లు రాబట్టిందో చూస్తే..
డ్యూడ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్, టీజర్, ట్రైలర్లతో డ్యూడ్ మూవీకి మంచి బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల రూపాయల షేర్... 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు తెలిపారు.

డ్యూడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడులో 31 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. డ్యూడ్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 550 స్క్రీన్‌లలో విడుదల చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
డ్యూడ్ నాలుగు రోజుల కలెక్షన్స్
డ్యూడ్ చిత్రానికి తొలి రోజున ఇండియా వైడ్‌గా 9.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 10.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 10.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10.8 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు వచ్చాయి. దీంతో నాలుగు రోజుల వరకు ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇండియాలో 41.55 కోట్ల రూపాయల నెట్.. 49 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
డ్యూడ్ ఓవర్సీస్ కలెక్షన్స్
రిలీజ్‌కు ముందు నుంచి నార్త్ అమెరికాలో ఈ సినిమా సంచలనం సృష్టించింది పెయిడ్ ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే భారీగా వసూళ్లు రాబట్టింది. నాలుగో రోజు నార్త్ అమెరికాలో 90K వరకు వసూళ్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో 4 రోజుల వరకు ఒక్క నార్త్ అమెరికాలోనే 600K ( భారత కరెన్సీలో 5.28 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక మిగిలిన దేశాల నుంచి 11 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్‌లో డ్యూడ్ మూవీకి ఇప్పటి వరకు 17 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ప్రదీప్ రంగనాథన్ మూవీ వరల్డ్ వైడ్‌గా 66 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే డ్యూడ్ చిత్రం 4 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 83 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే ... తొలి రోజున 3.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.9 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.8 కోట్ల రూపాయలు చొప్పున 10.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో డ్యూడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే... 3.28 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 73 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 2.83 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే... తమిళనాడులో 21.75 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 10.55 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.9 కోట్ల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.85 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 17 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.
డ్యూడ్ ఐదో రోజు వసూళ్లు
వీకెండ్, దీపావళి పర్వదినం కారణంగా డ్యూడ్ చిత్రం కలెక్షన్స్ కుమ్మేసింది. మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఐదో రోజు ప్రదీప్ రంగనాథన్ మూవీకి సాయంత్రం 4 గంటల వరకు తమిళనాడులో 34 శాతం, తెలుగులో 20 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ చెప్పింది. దాంతో ఐదో రోజు డ్యూడ్ చిత్రానికి తమిళంలో 4 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, కర్ణాటక + కేరళ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 8 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో త్వరలోనే ప్రదీప్ రంగనాథన్ మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











