Dude Day 6 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద డ్యూడ్ దూకుడు.. ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Dude Box Office Collections: దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "డ్యూడ్" సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందనను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై. రవిశంకర్, నవీన్ యెర్నెనీ నిర్మించిన ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ రెండింటినీ ఆకట్టుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సాయి అభయాంకర్ సంగీతం, నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, భరత్ విక్రమన్ ఎడిటింగ్ చేశారు. సాయి అభయాంకర్ సంగీత దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఆరోవ రోజు ఈ సినిమా ఎన్నికోట్లు రాబట్టిందో చూస్తే..

డ్యూడ్ బడ్జెట్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్
"డ్యూడ్" సినిమా బడ్జెట్ సుమారు రూ. 60 కోట్లు కాగా, ఇందులో నటీనటుల పారితోషికాలు, ప్రమోషనల్ ఈవెంట్స్, మార్కెటింగ్ ఖర్చులు అన్ని కలిపి ఉన్నాయి. విడుదలకు ముందే ఈ చిత్రం బిజినెస్ పరంగా మంచి రికార్డులు సృష్టించింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ. 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 4.5 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.5 కోట్లు, ఆంధ్రాలో రూ. 4 కోట్లు బిజినెస్ సాధించింది.

Dude Day 6 expected Box Office Collections Worldwide Pradeep Ranganathan movie pull off a strong score

బ్రేక్ ఈవెన్ కావాలంటే తెలుగు రాష్ట్రాల నుండి కనీసం రూ. 11 కోట్ల షేర్ అంటే రూ. 22 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు తెలిపారు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూడా "డ్యూడ్" ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. తమిళనాడులో రూ. 31 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లు బిజినెస్ సాధించింది. మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 59 కోట్లకు చేరింది. ఈ క్రమంలో ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల బాట పట్టాలంటే రూ. 60 కోట్ల షేర్, అంటే సుమారు రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంది.

అక్టోబర్ 17న విడుదలైన డ్యూడ్ తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. యూత్ ఆడియన్స్ సోషల్ మీడియాలో సినిమాపై రివ్యూలు పంచుకోవడంతో బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఇండియా వైడ్‌గా రూ. 9.75 కోట్ల నెట్ కలెక్షన్, రెండో రోజు రూ. 10.4 కోట్లు, మూడో రోజు రూ. 10.6 కోట్లు, నాలుగో రోజు రూ. 10.8 కోట్లు, ఐదవ రోజు రూ. 8.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఐదు రోజుల్లోనే "డ్యూడ్" సినిమా రూ. 50.2 కోట్ల నెట్ - రూ. 58 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇదిలాఉంటే.. మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ప్రకారం నాలుగో రోజుకే సినిమా రూ. 83 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసిందని తెలిపారు.

డ్యూడ్ ఆరో రోజు వసూళ్లు
వీకెండ్ , దీపావళి హాలీడేస్ కలసి రాయడంతో డ్యూడ్ సినిమాకు బంపర్ కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ, బుకింగ్స్ తగ్గకుండా కొనసాగాయి. సాక్‌నిక్ రిపోర్ట్స్ ప్రకారం ఆరో రోజు "డ్యూడ్" మూవీకి మార్నింగ్ షో ఆక్యుపెన్సీ 31%, మ్యాట్నీ షో వరకు 33% నమోదు అయ్యింది. ఈ ట్రెండ్ కొనసాగితే ఆరో రోజు ఇండియా వైడ్ గ్రాస్ రూ. 5.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోటి, అంటే వరల్డ్ వైడ్‌గా రూ. 6.5 నుంచి రూ. 7 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే "డ్యూడ్" త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. "డ్యూడ్" మూవీ బాక్సాఫీస్ రన్ మరో వారం కొనసాగితే, రూ. 120 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరడం పెద్ద విషయం కాదు. ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో ఇది అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. "డ్యూడ్" సినిమా సక్సెస్‌తో మైత్రీ మూవీ మేకర్స్ మరో బ్లాక్‌బస్టర్‌ను తమ ఖాతాలో వేసుకుంది. "డ్యూడ్" సినిమా ప్రస్తుతం సౌత్ ఇండియన్ బాక్సాఫీస్‌ను కదిలిస్తున్న హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X