Dude Day 9 Collections: భారీగా పడిపోయిన డ్యూడ్ వసూళ్లు... ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇంకెంత రావాలంటే?
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి లీడ్ రోల్స్ పోషించిన చిత్రం డ్యూడ్. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ నిర్మించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు కీలక పాత్రలు పోషించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ సంగీతం అందించారు. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డ్యూడ్ బడ్జెట్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే..
డ్యూడ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. డ్రాగన్ సినిమా తర్వాత ప్రదీప్ రంగరాజన్ నటించిన సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్ల కారణంగా ఈ సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. డ్యూడ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల రూపాయల షేర్... 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.

డ్యూడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడులో 31 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. డ్యూడ్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 550 స్క్రీన్‌లలో విడుదల చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
డ్యూడ్ 8 రోజుల కలెక్షన్స్
డ్యూడ్ చిత్రానికి తొలి రోజున ఇండియా వైడ్‌గా 9.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 10.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 10.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10.8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8.75 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 4 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.2 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో ఎనిమిది రోజుల వరకు ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇండియాలో 58.5 కోట్ల రూపాయల నెట్.. 68.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
డ్యూడ్ ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో డ్యూడ్‌కు సాలీడ్‌గా వసూళ్లు వస్తున్నాయి. గురువారం యూఎస్ఏ, కెనడాలలో ఈ సినిమా 12K (భారత కరెన్సీలో 10.53 లక్షల రూపాయలు) రాబట్టింది. గురువారం వరకు ఇక్కడ 688K డాలర్లు వసూలైనట్లుగా నివేదికలు చెబుతుండగా.. శుక్రవారం నాటికి నార్త్ అమెరికాలో 700K కలెక్షన్స్ (భారత కరెన్సీలో దాదాపు 6.14 కోట్ల రూపాయలు) దాటినట్లుగా తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ తదితర దేశాలలో డ్యూడ్ మూవీకి 18 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఓవర్సీస్ నుంచి ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇప్పటి వరకు 23.4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మమితా బైజు మూవీకి 8 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 92.25 కోట్ల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ చెప్పింది. అయితే డ్యూడ్ చిత్రం ఇప్పటికే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్లు చిత్ర నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే ... తొలి రోజున 3.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.9 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు, ఏడో రోజున 50 లక్షల రూపాయలు, ఎనిమిదవ రోజున 45 లక్షల రూపాయలు చొప్పున 13.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా డ్యూడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే... నైజాంలో 4.20 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో కోటి రూపాయలు, ఆంధ్రాలో 3.65 కోట్ల రూపాయలు చొప్పున షేర్ వసూలు చేసింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే... తమిళనాడులో 45.45 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 14.68 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5.22 కోట్ల రూపాయలు, కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.60 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 23.4 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.
డ్యూడ్ 9వ రోజు వసూళ్లు
బుధవారం నుంచి డ్యూడ్ కలెక్షన్స్ పడిపోతూనే ఉన్నాయి. దాంతో వీకెండ్‌పై చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకుంది. శనివారం డ్యూడ్ సినిమాకు సాయంత్రం 4 గంటల వరకు తమిళనాడులో 20 శాతం, తెలుగులో 16 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. 9వ రోజు ప్రదీప్ రంగనాథన్ మూవీకి తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, తెలుగులో 40 లక్షలు, కేరళ+ కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











