twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈగ’ టార్గెట్ కేవలం 30% రికవరికేనా?

    By Srikanya
    |

    రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'ఈ నెల 30న విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాజమౌళికున్న క్రేజ్ తో భారీగా బిజినెస్ జరిగిందని వినికిడి. దానికి తోడు తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్,డబ్బింగ్ రైట్స్,ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్నీ కలిసి 70% దాకా ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడిలో రికవరి అయ్యిపోయిందంటున్నారు. అందులోనూ చాలా ఏరియాలకు NRA బేసిస్ న రైట్స్ అమ్మారని తెలుస్తోంది. దాంతో నిర్మాతకు ఎట్టి పరిస్దితుల్లోనూ నష్టమెచ్చే అవకాసం లేదు. NRA అంటే..నాన్ రిటన్ బుల్ అడ్వాన్స్ అని. దాంతో ఒక వారం రోజులు పాటు ఈగ గట్టిగా ఏ పోటీ లేకుండా అడితే చాలు అని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.

    ఈ చిత్రాన్ని తమింళంలో 'నాన్ ఈ' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ శాటిలైర్ రైట్స్ ఓ రేంజిలో పలికి అందరికీ షాక్ ఇచ్చింది. తమిళంలో నెంబర్ వన్ ఛానెల్ అయిన సన్ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 3.35 కోట్లుకు కొనుగోలు చేసారు. ఓ తెలుగు డైరక్టర్ డైరక్ట్ చేసిన చిత్రానికి ఈ రేంజి రేటు పలకటం తమిళ శాటిలైట్స్ హిస్టరీలోనే ఓ పెద్ద రికార్డు అంటున్నారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా నిర్మిస్తోంది.

    ఇక రాజమౌళి ఈగని బైలింగ్వల్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మీడియాలో ఈగ చిత్రాన్ని నాన్ ఈ అనే టైటిల్ తో తమిళంలో డబ్బింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ మాట్లాడారు.ఆయన మాటల్లోనే...ఈగలోని ప్రతీషాట్ ని తెలుగు,తమిళ భాషల్లో సెరపేట్ గా చిత్రీకరించాము. నాన్ ఈ ఆనే చిత్రం తమళ డబ్బింగ్ వెర్షన్ కాదు. అది బైలిగ్వల్. ఇక హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాము. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర జరుపుకుంటోంది. ఈ 30న విడుదల చేస్తాము అన్నారు.

    సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా ' ఈగ' కథాంశం.

    English summary
    
 'Eega', the big budgeted sci-fi extravaganza of Rajamouli is targeting only a recovery of 30% from Box Office. Already, the makers are able to pull 70% of their investment through satellite rights, dubbing rights and area-wise selling of the film. With the popularity of the brand 'Rajamouli', they are able to get soaring prices for this film. They say that most of the area rights are sold on NRA basis that incurs no loss to producer even in case of loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X