Ek Deewane Ki Deewaniyat Box Office: బాక్సాఫీస్‌ను కుదిపేసిన చిన్న సినిమా.. 9 రోజుల్లో కోట్లు కుమ్మరించిన కనక

బాలీవుడ్‌తోపాటు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హర్షవర్ధన్ రాణే, యువ హీరోయిన్ సోనమ్ బజ్వా జంటగా నటించి చిత్రం ఏక్ దీవానే కీ దివానీయత్. మిలాప్ జవేరి రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అన్షుల్ రాజేంద్ర గార్గ్, దినేష్ జైన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు మహీర్ జవేరి ఎడిటింగ్, జాన్ స్టీవార్ట్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కౌశిక్ గుడ్డు, కునాల్ వర్మ, రజత్ నాగ్‌పాల్, అంకూర్ ఆర్ పాథక్, రాహుల్ మిశ్రా తదితరులు పాటలను అందించారు. దేవీ మూవీస్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రొమాన్స్, ఎమోషన్స్ కలిపి లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంలో సచిన్ కేడ్కర్, శరద్ రాంథ్వా, అనంత్ నారాయణ్ మహాదేవన్ లాంటి నటులు నటించారు. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలు కలుపుకొని సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Ek Deewane Ki Deewaniya

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రోమోలు, టీజర్, ట్రైలర్లకు విశేషమైన బజ్ క్రియేట్ కావడంతో తొలి రోజు భారీగా ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం 10 కోట్ల రూపాయలు, రెండో రోజు 9 కోట్ల రూపాయలు, మూడో రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారాంతంలోనే ఈ సినిమా 26 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ కావడంతో వారాంతం తర్వాత కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 4వ రోజున 6.5 కోట్ల రూపాయలు, 5వ రోజున 7.5 కోట్ల రూపాయలు, 6వ రోజున 8.5 కోట్ల రూపాయలు, 7వ రోజున 4 కోట్ల రూపాయలు, 8వ రోజున 4.5 కోట్ల, 9వ రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 60 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీగానే వసూళ్లను సాధించింది. ఈ సినిమా సుమారుగా 8 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 68 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు, ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది. ఈ సినిమా జోష్‌ను చూస్తే 100 కోట్ల రూపాయల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొని బాలీవుడ్‌కు మంచి ఊపును కలిగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X