Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
విజయ దేవరకొండ రికార్డు మటాష్.. 16 రోజుల వసూళ్లపై విక్టరీ పంజా!
సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్ F2 మూవీతో భారీ హిట్ కొట్టాడు. తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించి.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్నాడు. వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన చిత్రం మూడో వారంలో భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఇప్పట్లో భారీ సినిమాల రిలీజ్ లేకపోవడం సినిమాకు కలిసి వస్తున్నది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ వసూళ్ల రికార్డును వెంకీ అధిగమించడం ఓ రికార్డుగా మారింది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే..

16 రోజుల్లోనే రూ.71.76 కోట్లు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12న రిలీజైన F2 మూవీ వసూళ్ల మోత మోగిస్తున్నది. 16 రోజుల్లోనే ఈ చిత్రం రూ.71.76 కోట్ల షేర్ సాధించింది. గతంలో 16 రోజుల్లో గీత గోవిందం వసూలు చేసిన రూ.70 కోట్ల రికార్డును తుడిచిపెట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్లు సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.

తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్2 హవా
తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్2 సినిమా బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. నైజాంలో 16 రోజుల్లో ఈ చిత్రం రూ.20.44 కోట్లు వసూలు చేసింది. వాస్తవానికి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.9 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ రిపోర్డు. అలాగే రూ.5 కోట్లకు హక్కులను అమ్మగా సీడెడ్‌లో రూ.7.58 కోట్లు రాబట్టింది.
అనిల్ రావిపూడి తదుపరి చిత్రం.. లేడి ఓరియెంటెడ్ కథతో ప్రయోగం!

ఆంధ్రా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు
ఇక ఆంధ్రా విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో రూ.8.94 కోట్లు, గుంటూరులో రూ.5.10 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.6.25 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3.66 కోట్లు, కృష్ణాలో రూ.4.68 కోట్ల, నెల్లూరులో రూ.1.71 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 100 శాతం లాభాలు
ఓవర్సీస్ విషయానికి వస్తే ఎఫ్2 చిత్రం రూ.8.80 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలను మినహాయించి మిగితా రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.4.60 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.34.50 కోట్ల మేర థియేట్రికల్ హక్కులను అమ్మగా, మొత్తంగా రూ.71.76 కోట్లు వసూలు చేసింది.