»   » నాలుగు సినిమాలు ప్లాప్,ఐదోది పూర్తిగా గల్లంతు

నాలుగు సినిమాలు ప్లాప్,ఐదోది పూర్తిగా గల్లంతు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : మొన్న శుక్రవారం ఐపిఎల్ సీజన్ ని లెక్కచేయకుండా ఐదు సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చాయి. ఆ చిత్రాలు రామాచారి,లవ్ సైకిల్, లవ్ టచ్,రాజకోట రహస్యం. అయితే నాలుగు సినిమాలతో పాటు ఐదోది..నమిత మిడత రిలీజ్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ నాలుగు ప్లాప్ టాక్ తెచ్చుకుంటే..నమిత సినిమా మిడత రిలీజ్ అయ్యిందా లేదా కూడా ఎవరికీ తెలియటం లేదు.

ఇక కాళీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీ, రేష్మ హీరోహీరోయిన్లుగా సపన్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మాత రానా అందిస్తున్న చిత్రం 'లవ్‌ సైకిల్‌'...బెల్లు బ్రేకుల్‌ లేవు ఉపశీర్షిక. డి.ఎస్ రావు నిర్మాత. How to Lose a Guy in 10 Days (2003)అనే చిత్రాన్ని మక్కి గా కాపీ కొడుతూ వచ్చిన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకర్షించటం లేదు.

ఇక లవ్ టచ్ అనే టైటిల్ తో వచ్చిన మరో చిత్రం...ఈ రోజుల్లో,ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రాలను డైలాగులతో సహా ఎత్తేసి తీసిన ఈ చిత్రం పక్కా బూతు అదీ ఆకట్టుకోని చెత్త చిత్రంగా చెప్తున్నారు. ప్రసాంత్ హీరోగా వచ్చిన రాజకోట రహస్యం.. పూర్తి వేస్ట్ చిత్రం అని తేల్చి పారేసారు.

తొట్టెంపూడి వేణు, కమలిని ముఖర్జీ జంటగా జి. ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.వి.శ్యాంప్రసాద్ నిర్మించిన 'రామాచారి' చిత్రం కూడా విడుదల అయ్యింది. 'ఈడో పెద్ద గూఢచారి' అన్నది ఉపశీర్షిక. మళయాళ చిత్రం 'సీఐడీ మూసా' కి రీమేక్ ఇది. అయితే మరీ పాతకాలం నాటి కథ,కథనంతో రావటంతో సినిమాకు బాగా మైనస్ అయ్యింది.

English summary
Entire list newly released movies ‘ramachari, Love Cycle, Love Touch’ and ‘Rajakota Rahasyam’ have bit the dust miserably with critics not even showing a concern and reviewers finding them not so necessary flick for a post-mortem. If all four are declared duds, there is one more fifth film ‘Midatha’ from Namitha found no trace in market.
Please Wait while comments are loading...