Ghaati Closing Collections: ఘాటి సినిమా క్లోజింగ్ కలెక్షన్స్.. 5 రోజుల్లోనే వాష్ అవుట్.. నష్టం ఎన్ని కోట్లంటే?
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ఘాటి. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించడం విశేషం. ఇక చిత్రం తెలుగుతో పాటు తమిళంలో సెప్టెంబర్ 5న గ్రాండ్ గా విడుదలైంది. నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లముడి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఘాటి చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో తమిళ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు హీరోగా నటించారు. టాలీవుడ్ ప్రముఖ నటులు జగపతిబాబు, చైతన్య రావు మదాడి విలన్లుగా నటించి అలరించారు. ఈ సందర్భంగా ఘాటి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ ఈవెన్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్? క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఘాటి బడ్జెట్ ఎన్ని కోట్లు?
టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి, అనుష్క శెట్టి కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత వచ్చిన చిత్రం కావడం, మరోవైపు సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషించడం, ప్రముఖ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయడం, వివిధ లోకేషన్లతో సినిమా చిత్రీకరణ జరగడం విశేషం. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాల ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.50 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఘాటి చిత్రానికి థియేట్రికల్ రైట్స్ నైజాంలో రూ.8 కోట్లు, ఆంధ్రా నుంచి రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు, తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటక + కేరళలో రూ.5 కోట్లు, హిందీ బెల్ట్ లో రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగింది. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ.10 కోట్ల బిజినెస్ అయ్యిందని, ఇలా టోటల్ గా వరల్డ్ వైడ్‌గా ఘాటికి రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
అనుష్క శెట్టి ఘాటి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించాల్సి ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం తక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.55 కోట్ల ఇండియా షేర్, రూ.100 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కడుతున్నారు.
ఘాటి క్లోజింగ్ కలెక్షన్స్..
బాక్సాఫీస్ వద్ద ఘాటి చిత్రానికి ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గా రూ.4 కోట్లు గ్రాస్, 2వ రోజు కేెలవలం రూ.1.75 కోట్లు నెట్, రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేసింది. రూ.3వ రోజు రూ.1.15 కోట్ల ఇండియా నెట్, 4వ రోజు రూ.65 లక్షలు, 5వ రోజు కేవలం రూ.58 లక్షలు మాత్రమే వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ అందించింది. ఇలా టోటల్ నా ఇండియా నెట్ రూ.6.12 కోట్ల వరకు అందుకుంది.
మొదటి వీకెండ్ లో సినిమాకు ఓ మాదిరిగా వసూళ్లు దక్కినా ఆ తర్వాత మాత్రం మరీ దారుణంగా కలెక్షన్లు అందాయని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియా గ్రాస్ రూ.12 కోట్లు మాత్రమే వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో సినిమాకు 40 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











