Ghaati Day 1 Box Office Collections: ఘాటి ఓపెనింగ్ డే వసూళ్లు.. తొలిరోజు అనుష్కకు ఎన్ని కోట్లంటే?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాకు క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాకు చింతకింద శ్రీనివాస్ కథను అందించారు. క్రిష్ జార్లముడి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 5న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఈ సందర్భంగా ఘాటి చిత్రం ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు? ఇంతకీ ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఘాటి చిత్రం బడ్జెట్ ఎంత?
అనుష్క శెట్టి ఘాటి చిత్రం బడ్జెట్ భారీగానే ఉంది. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ వంటి ప్రముఖులు నటించారు. టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. సీనియర్ టెక్నీషియన్లు వర్క్ చేశారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.50 కోట్ల మేర పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Ghaati Day 1 Box Office Collections Worldwide

ఘాటి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్?
ఏపీ, ఆంధ్రాలో ఈ సినిమాకు భారీగానే థియేట్రికల్ రైట్స్ ద్వారా వ్యాపారం జరిగింది. నైజాం రైట్స్ ద్వారా రూ.8 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు అందాయి. ఇలా తెలుగు రాష్ట్రాల బిజినెస్ రూ.23 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాలైనా తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటక, కేరళ కలిపి రూ.5 కోట్లు, హిందీ బెల్ట్ లో రూ.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా రూ.19 కోట్లు అందాయి. ఓవర్సీస్ రైట్స్ నుంచి రూ.10 కోట్ల వ్యాపారం అయ్యింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ.52 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.

ఘాటి బ్రేక్ ఈవెన్ పాయింట్..
అనుష్క శెట్టికి బాక్సాఫీస్ వద్ద ఘాటి చిత్రంతో భారీ లక్ష్యం ఏర్పడింది. ఘాటి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆసక్తికరంగా మారింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు సంతోషిస్తున్నారు. కాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.55 కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

ఘాటి ఓపెనింగ్ డే వసూళ్లు..
ఘాటి చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి మాత్రం పాజిటివ్ టాక్ దక్కింది. ఇక సినిమా డే1 బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. కాగా సాక్ నిక్ రిపోర్ట్ ప్రకారం.. ఘాటి చిత్రం సాయంత్రం 4 గంటల వరకు రూ.1 కోటి ఇండియా నెట్ వసూల్ చేసిందని తెలిపింది. మిగితా షోలకు వచ్చే కలెక్షన్లు కలుపుకొని ఈ చిత్రం రూ.4 కోట్ల మేర ఇండియా నెట్, రూ.8 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేస్తుందని, ఇక ఓవర్సీస్ వసూళ్లు కలుపుకుని ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.10 నుంచి రూ.15 కోట్ల మధ్య గ్రాస్ వసూలవుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక శుక్రవారం పెద్ద ఎత్తున గణేషుడి నిమర్జనాలు ఉండటంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ చాలా వరకు తక్కువగా ఉంది. తెలుగులో ఓవరాల్ గా 22 శాతం ఆక్యుపెన్సీ, తమిళంలో 15 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. ఇక ఈ శుక్ర, శని, ఆది వారాలు సూళ్లు, ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉండటంతో ఘాటి సినిమాకు మరింత ఫుట్ ఫాట్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X