Ghaati Day 1 Collections: తొలిరోజే షాక్.. అంచనాలను తారుమారు చేసిన అనుష్క ఘాటి చిత్రం.. ఎన్ని కోట్లంటే?
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. తనకున్న క్రేజ్ తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగింది. బాహుబలి చిత్రం తర్వాత నామమాత్రంగానే సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఘాటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు నార్త్ లోనూ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఓపెనింగ్ డే వసూళ్లు షాకింగ్ గా ఉన్నాయి. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ ఎంత? ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు సంపాదించింది? ఎంత బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని కలిగి ఉందనే వివరాల్లోకి వెళితే..
ఘాటి బడ్జెట్ ఎన్ని కోట్లు?
క్రిష్ దర్శకత్వంలో పాటు అనుష్క శెట్టి లీడ్ రోల్ లో నటించడం, తమిళ లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ఫీమేల్ లీడ్ గా అలరించడం, చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ స్టార్స్ కీలక పాత్రలు పోషించడం, సీనియర్ టెక్నీషియన్లు పనిచేడంతో సినిమాకు భారీగానే ఖర్చైంది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు కలుపుకొని ఈ చిత్రానికి రూ.50 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లముడి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

ఘాటి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఘాటి మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్‌కు రూ.8 కోట్లు, ఆంధ్రా రైట్స్‌కు రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్ల వ్యాపారం జరిగింది. తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటక+కేరళ రూ.5 కోట్లు, నార్త్ లో రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. ఓవర్సీస్ రైట్స్‌కు రూ.10 కోట్లు అందాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ.52 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.
బ్రేక్ ఈవెన్ పాయింట్..
ఘాటి చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ లక్ష్యం ఉంది. థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రానికి పెద్ద మొత్తంలో టార్గెట్ ఏర్పడింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారాన్ని ఆధారం చేసుకుని బ్రేక్ ఈవెన్ పూర్తి చేయాలంటే రూ.55 కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.
ఘాటి డే1 కలెక్షన్స్..
ఘాటి చిత్రానికి తొలి రోజు భారీ వసూళ్లు అందుతాయని ట్రేడ్ నిపుణులు ఆశించారు. కానీ సినిమా అంచనాలకు తారుమారుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది. రిలీజ్ కు ముందే ఈ చిత్రం ఓపెనింగ్ డే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంటుందని అంచనా వేశారు. కానీ ఇండియా నెట్ రూ.2 కోట్లు మాత్రమే వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ అందింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఘాటి చిత్రం కేవలం 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
అయితే అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ తో ఘాటి చిత్రం మినిమమ్ అంచనాలను కూడా రీచ్ కాలేకపోయిందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. కాగా సెప్టెంబర్ 5న వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు ఉండటంతో థియేటర్ ఫూట్ పాల్ అత్యల్పంగా నమోదైందని అంటున్నారు. మొదటి రోజు ఓవరాల్ గా తెలుగులో రూ.24 శాతం, తమిళంలో రూ.19 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైందవ్వడం గమనార్హం. ఇక శని, ఆదివారాల్లో ఎలాంటి వసూళ్లు అందుతాయనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











