Ghaati Day 2 Collections: ఘాటి సినిమా 2వ రోజు కలెక్షన్స్.. అనుష్కకు ఛాలెంజ్.. ఎన్ని కోట్లు వసూలైందంటే?
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఘాటి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న తెలుగు, తమిళంలో గ్రాండ్ గా విడుదలైంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లముడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫీమేల్ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం థియేట్రికల్ రన్ ద్వారా వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా ఘాటి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 2వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ఘాటి బడ్జెట్ ఎన్ని కోట్లు?
బాహుబలితో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న అనుష్క శెట్టి లీడ్ రోల్ లో నటించడం, టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించడం, తమిళ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు హీరోగా, జగపతిబాబు, చైతన్య రావు మదాడి విలన్లుగా, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ టెక్నీషియన్లు వర్క్ చేశారు. ఈ క్రమంలో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ కలుపుకొని చిత్రానికి రూ.50 కోట్ల వరకు పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

ఘాటి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
అనుష్క శెట్టి క్రేజ్ కారణంగా ఘాటి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు స్టేట్స్ లో నైజాం థియేట్రికల్ రైట్స్ నుంచి రూ.8 కోట్లు, ఆంధ్రా రైట్స్ నుంచి రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు కలుపుకొని మొత్తం రూ.23 కోట్ల బిజినెస్ జరిగింది. తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటక+కేరళ రూ.5 కోట్లు, నార్త్ బెల్డ్ లో రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ రైట్స్‌కు రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.52 కోట్లు అందినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
సేఫ్ జోన్ లోకి రావాలంటే..?
ఘాటి చిత్రానికి బ్రేక్ ఈవెన్ పాయింట్ భారీగా నిర్ణయించారు. బాక్సాఫీస్ వద్ద భారీ లక్ష్యం ఉండటం ఇప్పుడు సవాల్ గా మారింది. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా వచ్చిన వసూళ్లతో, ఘాటి చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.55 కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కడుతున్నారు.
ఘాటి 2వ రోజు వసూళ్లు..
సెప్టెంబర్ 5న విడుదలైన ఘాటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను అందుకోలేక పోతోందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయలు తెలుపుతున్నారు. ఓపెనింగ్ డే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.4 కోట్లు అందాయి. ఇక 2వ రోజు సాయంత్రం 6 గంటల వరకు కేవలం 65 లక్షల ఇండియా నెట్ మాత్రమే వసూల్ చేసిందని సాక్ నిక్ చెబుతోంది. మిగితా షోలు కలుపుకొని 2వ రోజు ఇండియా నెట్ రూ.1.50 కోట్లు, గ్రాస్ రూ.3 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగులోనే ఈ చిత్రం రూ.2 కోట్లు వసూల్ చేసింది. మిగితా భాషల్లో పెద్దగా వసూళ్లు లేకపోవడం గమనార్హం. ఇక 2వ రోజు తెలుగులో 19 శాతం, తమిళంలో 18 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఘాటి చిత్రం 2వ రోజుతో రూ.8 కోట్ల వరకు గ్రాస్ వసూల్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేతుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











