Ghaati Day 3 Collections: ఘాటి 3వ రోజు వసూళ్లు.. మొదటి వీకెండ్ భారీ దెబ్బ.. టోటల్ ఎంతంటే?
పాన్ ఇండియా హీరోయిన్ అనుష్క శెట్టి లేటెస్ట్ ఫిల్మ్ ఘాటి. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న తెలుగు, తమిళంలో గ్రాండ్ గా విడుదలైంది. నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లముడి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా, ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 3వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత వసూలైందనే విషయానికొస్తే..
ఘాటి బడ్జెట్ ఎన్ని కోట్లు?
ఘాటి చిత్రంలో దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న పాన్ ఇండియా హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషించడం, టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం, తమిళ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు హీరోగా నటించడం, జగపతిబాబు, చైతన్య రావు మదాడి విలన్లుగా చేయడం విశేషం. సీనియర్ టెక్నీషియన్లు ఆయా విభాగాల్లో పనిచేశారు. ఈ క్రమంలో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ కలుపుకొని చిత్రానికి రూ.50 కోట్ల వరకు పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఘాటి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
తెలుగు స్టేట్స్ లో నైజాంలో రూ.8 కోట్లు, ఆంధ్రా నుంచి రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు, తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటక + కేరళలో రూ.5 కోట్లు, హిందీ బెల్ట్ లో రూ.5 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ.10 కోట్ల బిజినెస్ అయ్యింది. ఇలా వరల్డ్ వైడ్ గా ఘాటి చిత్రానికి రూ.52 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా అందిందని నిపుణులు తెలుపుతున్నారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఘాటి చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగానే ఉంది. సినిమాకు టాక్ ఒకింత భాగానే వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం తక్కువగా నమోదు అవుతున్నాయి. ఏదేమైనా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.55 కోట్ల ఇండియా షేర్, రూ.100 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్ణయించారు.
ఘాటి 3వ రోజు వసూళ్లు..
ఘాటి చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను అందుకోవడం లేదు. మరీ తక్కువగానే వసూళ్లను అందుకుంటోందని ట్రేడ్ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఘాటి చిత్రానికి ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గా రూ.4 కోట్లు గ్రాస్ వసూలైంది. అదే విధంగా 2వ రోజు కేవలం రూ.1.75 కోట్లు నెట్, రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేసింది. ఇలా 2 రోజుల్లో రూ.7 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇది కేవలం తెలుగు స్టేట్స్ లో మాత్రమే కలెక్షన్స్. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.10 కోట్ల వరకు వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇక 3వ రోజు సెప్టెంబర్ 7న ఆదివారం మరింత తక్కువగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. 3వ రోజు ఇండియా నెట్ సాయంత్రం 6 గంటల వరకు కేవలం రూ.55 లక్షలు మాత్రమే వసూళ్లు చేసిందని సాక్ రిపోర్ట్ చేసింది. ఇక మిగితా షోల కలెక్షన్లు కలుపుకొని సినిమాకు రూ.1.50 కోట్ల ఇండియా నెట్, రూ.3 కోట్ల గ్రాస్ అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 3వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 15 శాతమే నమోదు కావడం విశేషం.


Click it and Unblock the Notifications











