Ghaati Day 4 Collections: ఘాటి 4వ రోజు కలెక్షన్స్.. ఇలాగైతే నష్టాలు తప్పవా? ఎన్ని కోట్లంటే?
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఘాటి. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 5న తెలుగు, తమిళంలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లముడి నిర్మించారు. తమిళ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు హీరోగా నటించడం, జగపతిబాబు, చైతన్య రావు మదాడి విలన్లుగా చేయడం విశేషం. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ ఈవెన్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
ఘాటి బడ్జెట్ ఎన్ని కోట్లు?
పాన్ ఇండియా హీరోయిన్ అనుష్క శెట్టి, టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరోవైపు సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ టెక్నీషియన్లు కూడా వర్క్ చేశారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులను కలుపుకొని సినిమాకు రూ.50 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
థియేట్రికల్ రైట్స్ ద్వారా తెలుగు స్టేట్స్ నుంచి నైజాంలో రూ.8 కోట్లు, ఆంధ్రా నుంచి రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు, తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటక + కేరళలో రూ.5 కోట్లు, హిందీ బెల్ట్ లో రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ.10 కోట్ల వ్యాపారమైందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా వరల్డ్ వైడ్ గా ఘాటికి రూ.52 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని నిపుణులు తెలుపుతున్నారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
అనుష్క శెట్టి ఘాటి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించాల్సి ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం తక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.55 కోట్ల ఇండియా షేర్, రూ.100 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కడుతున్నారు.
ఘాటి 3 రోజుల వసూళ్లు..
బాక్సాఫీస్ వద్ద ఘాటి చిత్రానికి ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గా రూ.4 కోట్లు గ్రాస్, 2వ రోజు కేవలం రూ.1.75 కోట్లు నెట్, రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే వసూల్ చేసింది. రూ.3వ రోజు రూ.1.15 కోట్ల ఇండియా నెట్, రూ.2 కోట్ల గ్రాస్ వసూలైందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా 3 రోజుల్లో కేవలం
రూ.9 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇది కేవలం తెలుగు స్టేట్స్ వసూళ్లు మాత్రమే.
ఇక 4వ రోజు సెప్టెంబర్ 8న వర్కింగ్ డే సోమవారం వసూళ్లు మరీ తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం 6 గంటల వరకు కేవలం రూ.30 లక్షలు మాత్రమే అందిందని సాక్ నిక్ రిపోర్ట్ అందించింది. ఇక మిగితా షోలు కలుపుకొని 3వ రోజు రూ.60 లక్షల వరకు వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మొదటి వీకెండ్‌కే ఈ సినిమా కలెక్షన్లు ఆగిపోతుండటం గమనార్హం. ఇలాగైతే 40 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











