Ghaati Day 5 Collections: భారీగా క్షీణించిన ఘాటి కలెక్షన్స్.. అనుష్క మూవీకి నష్టాలు తప్పాలంటే?

అగ్ర కథానాయిక అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఘాటి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతి బాబు, చైతన్యరావు, జిషుసేన్ గుప్తా, జాన్ విజయ్, వీటీవీ గణేష్, రాజు సుందరం తదితరులు ఘాటిలో కీలకపాత్ర పోషించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ ఈవెన్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 5వ రోజు ఘాటి ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

ఘాటి బడ్జెట్ ఎన్ని కోట్లు?
ఘాటిలో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులుగా నిలిచారు. విశాఖపట్నం, మన్యం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులను కలుపుకొని ఘాటి సినిమాకు రూ.50 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

Ghaati Day 5 Expected Box Office Collections Worldwide Anushka Shetty Movie faces struggles

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి సినిమా వస్తుండటంతో పాటు దానికి క్రిష్ దర్శకుడు కావడంతో ఘాటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్లు, అనుష్క లుక్‌తో సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసింది. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు స్టేట్స్ నుంచి నైజాంలో రూ.8 కోట్లు, ఆంధ్రా నుంచి రూ.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5 కోట్లు, తమిళనాడులో రూ.9 కోట్లు, కర్ణాటక + కేరళలో రూ.5 కోట్లు, హిందీ బెల్ట్ లో రూ.5 కోట్లు చొప్పున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు ఓవర్సీస్ రైట్స్‌ ద్వారా రూ.10 కోట్ల వ్యాపారమైందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. దాంతో కలిపి వరల్డ్ వైడ్ గా ఘాటికి రూ.52 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
విడుదలకు ముందు భారీ హైప్ తెచ్చుకున్న ఘాటి లాభాల్లోకి రావాలంటే రూ.55 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.110 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అనుష్క శెట్టి సినిమాను ఆంధ్రా, తెలంగాణలలో 700 స్క్రీన్‌లలో.. ఇండియా వైడ్‌గా 450 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 450 స్క్రీన్‌లు చొప్పున వరల్డ్ వైడ్‌గా 2850 స్క్రీన్‌లలో రిలీజ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఘాటి నాలుగు రోజుల వసూళ్లు
ఇండియా వైడ్‌గా ఘాటికి తొలి రోజున 4 కోట్ల రూపాయలు, రెండో రోజున 2 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.50 కోట్ల రూపాయలు, నాలుగో రోజున కోటి రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌ 9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లో అనుష్క చిత్రానికి 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో వరల్డ్ వైడ్‌గా 4 రోజుల వరకు ఘాటి మూవీకి 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో అనుష్క శెట్టి నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. తొలి రోజు 2 కోట్ల రూపాయలు, రెండో రోజున 2 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.30 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 80 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలవారీగా ఘాటి కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 3 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 2.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 90 లక్షల రూపాయల చొప్పున వసూళ్లు సాధించింది.

ఘాటి 5వ రోజు వసూళ్లు
మిక్స్‌డ్ రెస్పాన్స్ మధ్య బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన ఘాటి.. రెండో రోజు నుంచే కలెక్షన్స్‌ను కోల్పోవడం మొదలుపెట్టింది. వర్కింగ్ డేస్‌లో అనుష్క చిత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఐదో రోజు సాయంత్రం 7 గంటల వరకు ఘాటికి కేవలం 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ మాత్రమే అందుకున్నట్లు సాక్‌నిక్ తెలిపింది. దీంతో అనుష్క చిత్రం ఐదో రోజు వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. దీంతో ఐదు రోజు వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 43 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X