Ghaati Worldwide Business: ఘాటి వరల్డ్ వైడ్ బిజినెస్.. అనుష్క శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే?
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు.
యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫి, తూరుపు చాణక్య రెడ్డి, నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీ 2025 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? రిలీజ్‌కు ముందు జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల సరిహద్దుల్లో జరిగే గంజాయి సాగు, రవాణా, మాఫియా అంశాల నేపథ్యంగా తెరకెక్కిన ఘాటి సినిమాను అనుష్క శెట్టి, జగపతి బాబు లాంటి స్టార్ వాల్యూ ఉన్న నటులతో.. అలాగే చైతన్య రావు, విక్రమ్ ప్రభు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో నిర్మించారు. ఈ సినిమా ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్జెట్‌ను సుమారుగా 50 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు వాల్యూ కట్టారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా రెస్పాన్స్ రావడంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది అని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అంటే.. ఆంధ్రా, నైజాం, సీడెడ్‌లో ఈ సినిమా బిజినెస్ క్రేజీగా జరిగింది. నైజాం రైట్స్ 8 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 23 కోట్ల రూపాయల వద్ద డీల్ క్లోజ్ అయింది అనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి తమిళనాడు రైట్స్ 9 కోట్ల రూపాయలకు, కర్ణాటక, కేరళ కలిపి 5 కోట్ల రూపాయలు, ఉత్తర భారతం 5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగేతర రాష్ట్రాల్లో 19 కోట్ల రూపాయలు మేర బిజినెస్ క్లోజ్ అయింది. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 10 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా అంటే.. 52 కోట్లు (ఆంద్రా,నైజాం, ఇండియా, ఓవర్సీస్) మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. బిజినెస్ పరంగా చూస్తే.. ఈ చిత్రానికి భారీ లక్ష్యమే సెట్ చేశారు. పాజిటివ్ టాక్ కనుక ఈ మూవీ సొంతం చేసుకొంటే.. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు లాభాల్లోకి రావడం ఈజీగానే ఉంటుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 55 కోట్ల రూపాయల షేర్.. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాహుబలి తర్వాత అనుష్కకు ఇండియా వైడ్, ముఖ్యంగా సౌత్‌లో భారీ ఫాలోయింగ్ ఉండటంతో బ్రేక్ ఈవెన్ ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











