Ghaati Total Collections: అనుష్క శెట్టి ఘాటి మూవీ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. లాభమా? నష్టమా?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన రీసెంట్ ఫిల్మ్ ఘాటి. క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ తో స్విటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లముడి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 5న తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ గా విడుదలైంది. ఇక తొలిరోజే అనుష్క శెట్టి చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో బాక్సాఫీస్ పై ప్రభావం పడింది. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ బ్రేక్ ఈవెన్ ఎంత? టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఘాటి బడ్జెట్ ఎన్ని కోట్లు?
ఈ చిత్రంలో తమిళ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్ గా, టాలీవుడ్ ప్రముఖ నటులు జగపతిబాబు, చైతన్య రావు మదాడి విలన్లుగా నటించారు. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం, సీనియర్ టెక్నిషియన్లు ఈ చిత్రానికి పని చేయడం విశేషం. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చు, ప్రచార కార్యక్రమాలకు అయిన వ్యయం మొత్తం కలుపుకొని ఘాటి సినిమాకు రూ.50 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Ghaati Total Box Office Total Collections Worldwide

ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్?
థియేట్రికల్ రైట్స్ ద్వారా నైజాంలో రూ.8 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు, సీడెడ్‌ రూ.5 కోట్లు, తమిళనాడు రూ.9 కోట్లు, కర్ణాటక + కేరళలో రూ.5 కోట్లు, హిందీలో రూ.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌ ఘాటికి రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ద్వారా రూ.55 కోట్ల ఇండియా షేర్, రూ.100 కోట్ల ఇండియా గ్రాస్ కలెక్ట్ చేయాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు.

ఘాటి 12 రోజుల ఇండియా నెట్..
ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గా రూ.4 కోట్లు గ్రాస్, 2వ రోజు రూ.1.75 కోట్లు నెట్, రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలైంది. 3వ రోజు రూ.1.15 కోట్ల ఇండియా నెట్, 4వ రోజు రూ.65 లక్షలు, 5వ రోజు కేవలం రూ.58 లక్షలు, 6వ రోజు రూ.31 లక్షలు, 7వ రోజు రూ.27 లక్షలు, 8వ రోజు రూ.2 లక్షలు, 9వ రోజు రూ.2 లక్షలు, 10వ రోజు రూ.8 లక్షలు, 11వ రోజు రూ.10 లక్షలు, 12వ రోజు రూ.8 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. దీంతో ఇండియా నెట్ రూ.7 కోట్లకు మాత్రమే చేరుకుందని సాక్ నిక్ గణంకాలు తెలుపుతున్నాయి.

ఘాటి వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..
ఈ చిత్రానికి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇండియా నెట్ రూ.7 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ రూ.14 కోట్లు వసూలైందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతానికి ఓవర్సీస్, తమిళ వెర్షన్ నుంచి అంతంత మాత్రమే వసూల్లు ఉన్నాయని, ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.15 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ పండింతులు తెలుపుతున్నారు.

లాభమా? నష్టమా?
బాహుబలి చిత్రంతో అనుష్క శెట్టి పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. ఇక స్ట్రాటజీతోనే ఘాటి చిత్రాన్ని పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ చేశారు. కానీ యాక్షన్ ఫిల్మ్ కు ఆడియెన్స్ అంతగా కనెక్ట్ కాలేదు. థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ కేవలం 15 కోట్ల గ్రాస్ రూపాయలకే పరిమితం అయ్యింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.20 కోట్ల నెట్ వరకు రికవరీ అయ్యే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సినిమా బడ్జెట్ లో రూ.30 కోట్ల వరకు తిరిగి వచ్చినా.. ఇంకా 20 కోట్ల వరకు నష్టాలనే మిగుల్చిందని తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X