»   » ఘాజీ కలెక్షన్స్: బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది!

ఘాజీ కలెక్షన్స్: బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారత దేశపు మొదట్టమొదటి సబ్ మెరైన్ కాన్సెప్ట్ మూవీ 'ఘాజీ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్(శుక్ర, శని, ఆది) సంతృప్తికరమైన వసూళ్లు రాబట్టింది.

తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసారు. అన్ని వెర్షన్లు కలిపి ఈ చిత్రం ఇండియాలో ఫస్ట్ వీకెండ్ 15.75 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ. 4.25 కోట్లు, శనివారం 5.25 కోట్లు, ఆదివారం రూ. 6.25 కోట్లు వసూలైంది.


ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఘాజీ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే హాఫ్ మిలియన్ మార్కుకు చేరువైంది.


అర మిలియన్

అర మిలియన్

అమెరికాలో ఘాజీ చిత్రం ఫస్ట్ వీకెండ్ వసూళ్లు సంతృప్తి‌కరంగా ఉన్నాయని, ఫస్ట్ వీకెండ్ లోనే ఈచిత్రం లాభాల్లోకి వెళ్లింది. ఫస్ట్ వీకెండ్ దాదాపు $440k వసూలు చేసింది.


కమర్షియల్ కాకపోయినా గ్రేట్

కమర్షియల్ కాకపోయినా గ్రేట్

కమర్షియల్ ఎంటర్టెనర్ కాక పోయినా, పాటలు, గ్లామర్ కాకపోయినా ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఈ రేంజిలో రావడం గ్రేట్ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


యూవి క్రియేషన్స్ వారే కొన్నారు

యూవి క్రియేషన్స్ వారే కొన్నారు

యూఎస్ఏలో ఘాజీ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు రూ. 2 కోట్లకు కొని గ్రేట్ ఇండియా ఫిలింస్ ద్వారా విడుదల చేసారు. సినిమాకు మంచి వసూళ్లు వస్తుండటం, లాభాల భాటలో ఉండటంతో అంతా హ్యాపీగా ఉన్నారు.


తెలుగు నుండే

తెలుగు నుండే

యూఎస్ఏలో 90 శాతం కలెక్షన్స్ కేవలం తెలుగు నుండే వస్తున్నాయట. ఇక్కడ హిందీ, తమిళం కంటే తెలుగు వెర్షనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.


English summary
Rana Daggubati's Multilingual film, Ghazi which had a good opening on its release day even consolidated over the weekend. "TheGhaziAttack - All versions: Fri 4.25 cr, Sat 5.25 cr, Sun 6.25 cr. Total: ₹ 15.75 cr." taran adarsh tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu