రామ్ చరణ్ కోసం నాగబాబు కొడుకు వెనక్కి

వరుణ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
సమర్పకుడు ఠాగూర్ మధు మాట్లాడుతూ ''ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్ చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే చిత్రీకరణతో మూడు పాటలు మినహా మొత్తం పూర్తవుతుంది. మా సినిమాకు పలు టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. అయినా మేం ఇంకా ఏమీ నిర్ణయించలేదు. ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. త్వరలో ప్రకటిస్తాం'' అని అన్నారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, నాజర్ ఇందులో కీలక పాత్రధారులు.


Click it and Unblock the Notifications