»   » పవన్ 'గోపాల గోపాల' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే...

పవన్ 'గోపాల గోపాల' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : . వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధానపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. శ్రియ ముఖ్య పాత్రధారి. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకుడు. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్‌'కిది రీమేక్‌. అందులో పరేష్‌ రావల్‌ పోషించిన పాత్రను ఇక్కడ వెంకటేష్‌, అక్షయ్‌ కుమార్‌ చేసిన కృష్ణుడు పాత్రను పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని...కృష్ణాష్టమి (ఆగస్టు 16) రోజు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

కృష్ణుడు కీలకపాత్రలో వచ్చే చిత్రం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం పవన్ మీదే పోస్టర్ విడుదల చేస్తారా..లేక వెంకీ,పవన్ తో కలిపిన పోస్టర్ విడుదల చేస్తారా అనేది చూడాల్సిందే. ఇక 'గోపాల గోపాల' సెట్‌లోకి రీసెంట్ గా కృష్ణుడు గా పవన్ అడుగు పెట్టాడు. సోమవారం నుంచి పవన్‌ కల్యాణ్‌ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు.

Gopala Gopala first look on Krishna ashtami

వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి

పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
Pawan Kalyan's Gopala Gopala makers are planning to celebrate Krishna ashtami by releasing the first look on Aug 16th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X