Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యావరేజ్: ‘గోపాల గోపాల’ యూఎస్ఏ కలెక్షన్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం కలెక్షన్స్ యూఎస్ఏలో ఆశించినంతగా లేదనే వాదన వినిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్లను నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అక్కడ శుక్రవారం ప్రీమియర్ షోలతో మొదలైంది. మొత్తం 101 లొకేషన్లలో సినిమా విడుదలైంది.
శుక్రవారం $282000, శనివారం $305000, ఆదివారం కేవలం $120000 మాత్రమే వసూలు చేసింది. ఇప్పటి వరకు కేవలం $707000 మాత్రమే వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ 1 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. సంక్రాంతికి ‘ఐ' సినిమా వస్తుండటంతో చాలా థియేటర్ల ‘గోపాల గోపాల' తీసేసి ‘ఐ' వేస్తున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం 1 మిలియన్ మార్కు అందుకోవడం కష్టమే అంటున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈచిత్రం బాగా ఆడుతోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.